Vikram : కమల్ హాసన్- లోకేష్ కనగరాజ్ కాంబోలో రానున్న ‘విక్రమ్’.. శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్న యూనివర్సల్ హీరో…

|

Oct 03, 2021 | 3:46 PM

యూనివర్సల్ హీరో  కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్‌  'విక్రమ్'. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి నిర్మాణ భాగస్వామిగా కూడా బాధ్యతలు చేపట్టారు..

Vikram : కమల్ హాసన్- లోకేష్ కనగరాజ్ కాంబోలో రానున్న విక్రమ్.. శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్న యూనివర్సల్ హీరో...
Vikram
Follow us on

Vikram: యూనివర్సల్ హీరో  కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్‌  ‘విక్రమ్’. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి నిర్మాణ భాగస్వామిగా కూడా బాధ్యతలు చేపట్టారు కమల్ హాసన్. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ భాగమవుతున్నారు. ఈ ఏడాది జూలైలో విడుదల చేసిన ‘విక్రమ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకొని సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుతున్న చిత్రయూనిట్.. తాజాగా సెకండ్ షెడ్యూల్ ఫినిష్ చేశారు. ఈ సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌లో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపారు.

‘విక్రమ్’ సెకండ్ షెడ్యూల్ సక్సెస్ ఫుల్‌గా ఫినిష్ అయిందని పేర్కొంటూ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ మేరకు కమల్ హాసన్ మడ్ బైక్‌పై కూర్చొని ఉన్న పిక్ షేర్ చేశారు. ఈ ఫొటోలో కమల్‌తో పాటు సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్, స్టంట్ మాస్టర్ డుయో అన్బరీవ్ కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో కాళిదాస్ జయరాం, నరైన్,  అర్జున్ దాస్, శివాని నారాయణన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు.  ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో.. కనీళ్ళు వస్తున్నాయంటూ ఎమోషనల్ అయిన నాగ్..

MAA Elections 2021: హోరాహోరీగాఎన్నికల ప్రచారం.. నటసింహంను కలిసిన మంచు విష్ణు..

Poonam Kaur: సిద్దార్థ్ ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన పూనమ్ కౌర్.. తన మార్క్ కామెంట్.. అంతా గందరగోళం

Mahesh Babu: స్పెయిన్‌ బాట పట్టిన టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ .. ఓ వైపు షూటింగ్‌ మరోవైపు ఫ్యామిలీ ట్రిప్‌..