Kamal Haasan: రాజ్యసభ ఎన్నికలకు కమల్ హాసన్ నామినేషన్.. ఆస్తులు ఎంత ఉన్నాయంటే..

రాజ్యసభకు కమల్‌హాసన్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. చెన్నైలో నామినేషన్‌ పత్రాలు సమర్పించారు కమల్‌. తమిళనాడు సీఎం MK స్టాలిన్‌, మంత్రి ఉదయనిధి హాజరయ్యారు. తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని ఆయన చేసిన వ్యాఖ్యలు మంటలురేపాయి. హైకోర్టు సూచించినా, ఆయన క్షమాపణలు చెప్పలేదు. ఈ ఎపిసోడ్‌ తర్వాత కమల్‌ హాసన్‌ నామినేషన్‌ దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Kamal Haasan: రాజ్యసభ ఎన్నికలకు కమల్ హాసన్ నామినేషన్.. ఆస్తులు ఎంత ఉన్నాయంటే..
Kamal Haasan

Updated on: Jun 07, 2025 | 7:55 AM

ప్రస్తుతం కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమా థియేటర్లలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దాదాపు 30 ఏళ్ల తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఆయన ప్రధాన పాత్ర పోషించిన సినిమా కావడంతో విడుదలకు ముందే మంచి హైప్ నెలకొంది. ఇందులో త్రిష, అభిరామి, శింబు కీలకపాత్రలు పోషించగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. జూన్ 5న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. ఇదిలా ఉంటే.. రాజ్యసభకు కమల్‌హాసన్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. తమిళనాడు అధికార పార్టీ డీఎంకే మద్దతుతో ఆయన ఎగువ సభకు వెళ్లనున్నారు. చెన్నైలో తమిళనాడు సీఎం MK స్టాలిన్‌, మంత్రి ఉదయనిధితో కలిసి రాజ్యసభ ఎన్నికలకు దాఖలు చేసిన నామినేషన్ పాత్రల్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు.

కమల్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో తనకు రూ.305.55 కోట్ల (రూ.245.86 కోట్ల విలువైన చరాస్తులు, రూ.59.69 కోట్ల స్థిరాస్తులు) ఆస్తులు ఉన్నాయని వెల్లడించారు. గత నాలుగు సంవత్సరాలుగా ఆయన మొత్తం అప్పు రూ.49 కోట్లుగానే ఉంది. 2023-2024 సంవత్సరానికి కమల్ ఆదాయం తన పన్ను రిటర్నుల ప్రకారం రూ.78.9 కోట్లు. ఇది 2019-2020లో రూ.22.1 కోట్లుగా ఉంది. ఆయన చరాస్తుల విలువ రూ.59.69 కోట్లకు పెరిగింది. అలాగే 2021లో రూ.45.09 కోట్ల నుండి దాదాపు రూ.15 కోట్లు పెరిగింది. ఆయన స్థిరాస్తుల విలువ రూ.245.86 కోట్లు. 2021లో రూ.131.84 కోట్లుగా ఉంది. ఆయనకు నాలుగు కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి. అల్వార్‌పేటలో రెండు, ఉతండిలో ఒకటి, షోలింగనల్లూర్‌లో మరొకటి. వీటి మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ.111.1 కోట్లు. దిండిగల్‌లోని విల్‌పట్టి గ్రామంలో వ్యవసాయ భూమిని కూడా ఆయన కలిగి ఉన్నారు. దీని విలువ రూ.22.24 కోట్లు.

2015 లో కొనుగోలు చేసిన BMW 730 LD కారును, 2018లో లెక్సస్ Lx 570 లాన్సన్‌ను అదే బ్రాండ్ నుండి కొత్త వాహనాలకు అప్‌గ్రేడ్ చేశాడు. 2021 నుండి నాలుగు సంవత్సరాలలో తన లగ్జరీ కార్లలో మెర్సిడెస్ బెంజ్‌ వాహనాన్ని కూడా జత చేశారు. కమల్ హాసన్ పురసవాల్కంలోని సర్ ఎం. సి.టి. ముత్తయ్య చెట్టియార్ బాలుర హయ్యర్ సెకండరీ స్కూల్ నుండి 8వ తరగతి పూర్తి చేశాడు. థగ్ లైఫ్ మూవీ ప్రమోషన్లలో కమల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని ఆయన చేసిన వ్యాఖ్యలు మంటలురేపాయి. హైకోర్టు సూచించినా, ఆయన క్షమాపణలు చెప్పలేదు.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..