Vikram Movie: తెలుగు రాష్ట్రాల్లో విక్రమ్ జోరు.. మరోసారి సత్తా చాటిన కమల్.. గ్రాండ్‏గా సక్సెస్ పార్టీ..

|

Jun 19, 2022 | 11:43 AM

విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య కీలకపాత్రలలో నటించిన విక్రమ్ సినిమా థియేటర్ల వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతుంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 300 కోట్ల క్లబ్‏లో చేరిపోయి రికార్డ్ క్రియేట్ చేసింది.

Vikram Movie: తెలుగు రాష్ట్రాల్లో విక్రమ్ జోరు.. మరోసారి సత్తా చాటిన కమల్.. గ్రాండ్‏గా సక్సెస్ పార్టీ..
Vikram
Follow us on

బాక్సాఫీస్ వద్ద విక్రమ్ (Vikram) జోరు కొనసాగుతుంది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య కీలకపాత్రలలో నటించిన విక్రమ్ సినిమా థియేటర్ల వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతుంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 300 కోట్ల క్లబ్‏లో చేరిపోయి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక తమిళనాడులో ఈ సినిమా సరికొత్త రికార్డ్ సృష్టించింది.. బాహుబలి 2 మూవీ వసూళ్లను అధిగమించి అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. జూన్ 3న విడుదలైన ఈ మూవీ 16 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లు రాబట్టింది.. ఈ విషయాన్ని ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు.

ఇదిలా ఉంటే .. తెలుగు రాష్ట్రాల్లో విక్రమ్ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. దాదాపు పదేళ్ల తర్వాత కమల్ ఈ సినిమాతో సత్తా చాటుతున్నాడు. హై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. ఇక ఈ సినిమా సక్సెస్ జోష్ తో చిత్రయూనిట్ ఘనంగా పార్టీ జరుపుకుంది. చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన వారికి, థియేటర్ యజమానులకు స్పెషల్ పార్టీ ఇచ్చింది. చెన్నైలో నిర్వహించిన ఈ పార్టీకి కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్, అనిరుధ్ రవిచందర్, విజయ్ సేతుపతి, ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను హిట్ చేసినందకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు కమల్ హాసన్.. అలాగే విజయ్ , లోకేష్ కనగరాజ్ కాంబోలో రాబోతున్న చిత్రాన్ని కూడా ఆదరించాలని కోరారు.. విక్రమ్ సినిమా తనపై బాధ్యతలను మరింత పెంచిందని.. మరిన్ని మంచి సినిమాలు రూపొందించేందుకు శ్రమిస్తానంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.