యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తిరిగి సినిమాల మీద కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. ఎన్నో ఆశలతో ఎన్నికల్లో పోటి చేస్తే ఒక్క సీటు కూడా దక్కలేదు. దీంతో బ్యాక్ టు ఫిలిమ్స్ అన్న ఆలోచనలో ఉన్నారట. అంతేకాదు చిక్కుల్లో పడి ఆగిపోయిన సినిమాలను పట్టాలెక్కించే బాధ్యతను కూడా తానే స్వయంగా తీసుకోబోతున్నారన్నది కోలీవుడ్ న్యూస్ అప్డేట్. శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 రీమేక్‌ను గ్రాండ్‌గా స్టార్ చేశారు లోకనాయకుడు. కానీ వరుస అవాంతరాలతో ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. 2010లో విడుదలైన రోబో మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత శంకర్ కెరీర్ పరంగా హిట్స్ లేక కిందకి పడిపోతూ వచ్చారు. కానీ క్రేజ్ మాత్రం అలాగే ఉంది. రోబో తర్వాత ‘స్నేహితుడు’ విక్రమ్ ఐ, రజినీతో రోబో-2 సినిమాలు తెరకెక్కించాడు. కానీ ఒక్కటీ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అందుకోలేదు. ఇంతలో వెంటనే భారతీయుడు సీక్వెల్ ప్రకటించాడు. కానీ శంకర్, నిర్మాణ సంస్థ లైకా మధ్య వివాదం మరింత ముదరటంతో ఇక ఆ సినిమా లేనట్టే అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. అయితే ఇప్పుడు అన్ని సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకోవాలనుకుంటున్నారు కమల్ హాసన్.
అంతేకాదు ఎన్నికలకు ముందే స్టార్ట్ చేసిన విక్రమ్ సినిమాను కూడా త్వరలోనే రీస్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమా మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :