Kamal Haasan: 36 ఏళ్ల తర్వాత కలిసి సినిమా చేయనున్న కమల్ హాసన్, మణిరత్నం..

‘ఇండియన్ 2’ సినిమా పనులు దాదాపుగా పూర్తయ్యాయని తెలుస్తోంది. ఈ సినిమాకు టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వచ్చిన ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది.అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న కల్కి 2898 ఏడీ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీలో కమల్ పాత్ర చాలా కీలకంగా ఉండనుందని తెలుస్తోంది.

Kamal Haasan: 36 ఏళ్ల తర్వాత కలిసి సినిమా చేయనున్న కమల్ హాసన్, మణిరత్నం..
Kamal Haasan

Updated on: Oct 28, 2023 | 8:00 AM

కమల్ హాసన్ తమిళ సినిమా  హీరోగా రాణిస్తున్నారు. రాజకీయాల్లో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో సినిమా పనుల్లో ఎక్కువగా నిమగ్నమయ్యారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ సినిమా హిట్ తర్వాత ఆయన పాపులారిటీ రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం కమల్ హాసన్ చాలా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘ఇండియన్ 2’ సినిమా పనులు దాదాపుగా పూర్తయ్యాయని తెలుస్తోంది. ఈ సినిమాకు టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వచ్చిన ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది.అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న కల్కి 2898 ఏడీ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీలో కమల్ పాత్ర చాలా కీలకంగా ఉండనుందని తెలుస్తోంది. అలాగే హెచ్. వినోద్ దర్శకత్వంలో కమల్ నటిస్తున్న చిత్రం ‘కేహెచ్ 233’ కూడా త్వరలోనే పట్టాలెక్కనుంది. దీనితో పాటు మణిరత్నం దర్శకత్వంలో ‘ కేహెచ్234’లో కూడా మొదలుపెట్టనున్నారు. ఈ సినిమా అధికారికంగా ప్రారంభమైంది.

‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్ ప్రారంభమై కొన్నేళ్లు గడిచాయి. కోవిడ్ , సినిమా సెట్‌లో ప్రమాదం వంటి అనేక కారణాల వల్ల సినిమా విడుదల తేదీ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు కమల్ పెద్దగా కాల్షీట్ ఇవ్వలేదని తెలుస్తోంది. దాంతో ఈ సినిమా పనులు త్వరగా పూర్తికానున్నాయి.

కమల్ హాసన్ 234వ సినిమా ప్రారంభోత్సవం శుక్రవారం (అక్టోబర్ 27) చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రవి చంద్రన్ పాల్గొన్నారు. క్యూరియాసిటీ క్రియేట్ చేసిన ఈ వేడుకలో ‘విక్రమ్’, ‘లియో’, ‘ఖైదీ’ సినిమాల స్టంట్ కొరియోగ్రాఫర్లు అంబుమణి, అరివుమణి కూడా పాల్గొన్నారు.

1987లో ‘నాయకన్‌’ సినిమా విడుదలైంది. కమల్ హాసన్ నటించిన ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేయలేదు. ఇప్పుడు 36 ఏళ్ల తర్వాత సూపర్ హిట్ కాంబో ఒక్కటైంది. కమల్ హాసన్, మణిరత్నం తదితరులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దళపతి విజయ్ కథానాయకుడిగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లియో’ చిత్రం ఇటీవల విడుదలై మిశ్రమ స్పందనను అందుకుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో కమల్ హాసన్ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. కానీ, ఆయన గొంతు మాత్రమే వినిపించింది. ‘విక్రమ్‌’ సీక్వెల్‌లో కూడా కమల్‌హాసన్‌ నటించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.