Kalyani Priyadarshan: అతనికి లగ్జరీ వాచ్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన కల్యాణి ప్రియదర్శన్.. రేటు ఎన్ని లక్షలో తెలుసా?

స్టార్ డైరెక్టర్ కూతురిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కల్యాణి ప్రియదర్శన్‌ . హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసింది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ పడలేదు. ఇప్పుడు కొత్త లోకాతో ఆ కోరిక తీరిపోయింది.

Kalyani Priyadarshan: అతనికి లగ్జరీ వాచ్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన కల్యాణి ప్రియదర్శన్.. రేటు ఎన్ని లక్షలో తెలుసా?
Kalyani Priyadarshan

Updated on: Oct 03, 2025 | 5:40 PM

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కల్యాణి ప్రియదర్శన్. మొదటి సినిమాలోనే అందం, అభినయం పరంగా కుర్రకారును కట్టి పడేసింది. కానీ సినిమా సక్సెస్ అవ్వలేదు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి చేసిన రెండో చిత్రం చిత్రల హరి సినిమా సూపర్ హిట్ అయినా ఆ సక్సెస్ క్రెడిట్ హీరో ఖాతాలోకి వెళ్లిపోయింది. శర్వానంద్ తో చేసిన రణరంగం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. తెలుగు, మలయాళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ చాలా కాలంగా ఒక బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూడసాగింది. అయితే ఎట్టకేలకు కొత్త లోక: చాప్టర్‌ 1 తో ఈ ముద్దుగుమ్మ ఆశ నెరవేరింది. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సూపర్ ‘హీరో’యిన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన బ్యానర్ వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. కల్యాణి ప్రియదర్శన్ తో పాటు నెస్లెన్, శాండీ మాస్టర్, అన్నా బెన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలో రిలీజై నెల రోజులు గడుస్తున్నా ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ రూ. 300 కోట్లకు చేరువలో ఉంది.

కాగా కొత్త లోక: చాప్టర్‌ 1 సినిమాకు నిమిష్‌ రవి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించాడు. సినిమా సక్సెస్ కావడంలో అతను కూడా కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో తనను ఎంతో అందంగా చూపించిన నిమిష రవికి కల్యాణి ప్రియదర్శన్‌ ఖరీదైన బహుమతినిచ్చింది. రూ.9.8 లక్షల విలువైన చేతి గడియారాన్ని కానుకగా ఇచ్చింది. ఈ విషయాన్ని నిమిష్‌ రవి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కల్యాణి ఇచ్చిన వాచ్ ను ధరించి ఫొటోకు పోజులిచ్చాడు. ‘ ప్రియమైన కల్యాణి, ఈ కానుక ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్‌.. ఎప్పుడూ కష్టపడి పనిచేస్తే ఫలితం దానంతటదే వస్తుందనడానికి కొత్త లోక సినిమాయే నిదర్శనం. ఈ వాచ్‌ చూసుకున్నప్పుడల్లా ఈ లైన్‌ గుర్తు చేసుకుంటూ ఉంటాను. నిజమైన హార్డ్‌ వర్క్‌కు ఇదొక బహుమానం’ అని రాసుకొచ్చాడు నిమిష్‌ రవి. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

హీరోయిన్ ఇచ్చిన వాచ్ తో నిమిష్ రవి..

కల్యాణి ప్రియదర్శన్ లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.