Devil Twitter Review: కళ్యాణ్ రామ్ ఊచకోత.. హిట్ టాక్ తెచ్చుకున్న ‘డెవిల్’

కెరీర్ లో ఫస్ట్ టైమ్ స్పై థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు కళ్యాణ్ రామ్. సంయుక్త మీనన్, కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ సినిమా ఈరోజు (డిసెంబర్ 29)న థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్ షోస్ చూసిన అడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. తెల్లవారుజామునే సోషల్ మీడియాలో డెవిల్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. ఈ సినిమా బాగుందని... డెవిల్ కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Devil Twitter Review: కళ్యాణ్ రామ్ ఊచకోత.. హిట్ టాక్ తెచ్చుకున్న 'డెవిల్'
Devil movie twitter review
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 29, 2023 | 11:13 AM

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా డెవిల్. విడుదలకు ముందే పోస్టర్స్,టీజర్, ట్రైలర్‏తో మరింత హైప్ పెంచేశారు మేకర్స్. దీంతో ఈ సినిమాను చూసేందుకు నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. కెరీర్ లో ఫస్ట్ టైమ్ స్పై థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు కళ్యాణ్ రామ్. సంయుక్త మీనన్, కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ సినిమా ఈరోజు (డిసెంబర్ 29)న థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్ షోస్ చూసిన అడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. తెల్లవారుజామునే సోషల్ మీడియాలో డెవిల్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. ఈ సినిమా బాగుందని… డెవిల్ కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకు బీజీఎం హైలెట్ అని అంటున్నారు. అలాగే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఎంట్రీ అదిరిపోయిందని.. మాస్ ఊచకోత అంటున్నారు. డెవిల్ సినిమా గురించి ట్విట్టర్ లో పంచుకుంటున్నారు.

డెవిల్ సినిమా అద్భుతంగా ఉందని.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులున్నాయట. డెవిల్ అంటే కళ్యాణ్ రామ్ వన్ మెన్ షో అని.. బీజీఎం నెక్ట్స్ లెవల్ అంటున్నారు. కళ్యాణ్ రామ్ మాస్ ఊచకోత.. బ్లాక్ బస్టర్ హిట్ బొమ్మ అని కన్ఫామ్ అంటున్నారు. బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ విజయపథాన్ని కంటిన్యూ చేస్తున్నాడని ట్వీట్స్ చేస్తున్నారు.

ఫస్ట్ హాఫ్ బాగుందని.. ఇక సెకండ్ హాఫ్ మాస్ అంటున్నారు. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద డెవిల్ ఊచకోతే.. సినిమా సూపర్ అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.

ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ మీదే నడుస్తుందని.. సెకండాఫ్ ట్విస్టులు, టర్న్స్, చిల్ మూమెంట్స్ ఉంటాయని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ కంటే ద్వితీయార్థమే బాగుందంట.. కళ్యాణ్ రామ్ వన్ మెన్ షో అంటున్నారు. గుడ్ థ్రిల్లర్ కమర్షియల్ మూవీ అంటూ ట్వీట్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.