Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Padukone: అభిమానులకు బ్యాడ్ న్యూస్.. షాకింగ్ నిర్ణయం తీసుకోనున్న దీపికా..!

బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ను ఈ అమ్మడు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. దీపికా ప్రస్తుతం గర్భవతి. సెప్టెంబర్‌లో తొలి బిడ్డకు జన్మనివ్వనుంది ఈ అందాల భామ.  కడుపుతో ఉండి కూడా కల్కి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది దీపికా. ఇదిలా ఉంటే తాజాగా దీపికా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

Deepika Padukone: అభిమానులకు బ్యాడ్ న్యూస్.. షాకింగ్ నిర్ణయం తీసుకోనున్న దీపికా..!
Deepika Padukone
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 27, 2024 | 2:34 PM

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె.. రీసెంట్ గా కల్కి సినిమాతో భారీ హిట్ అందుకుంది. బాలీవుడ్ లో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళింది దీపికా. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ను ఈ అమ్మడు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. దీపికా ప్రస్తుతం గర్భవతి. సెప్టెంబర్‌లో తొలి బిడ్డకు జన్మనివ్వనుంది ఈ అందాల భామ.  కడుపుతో ఉండి కూడా కల్కి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది దీపికా. ఇదిలా ఉంటే తాజాగా దీపికా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఆ న్యూస్ ఇప్పుడు వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మ్యాటర్ ఏంటంటే..

ఇది కూడా చదవండి: అమ్మబాబోయ్..!! టక్కరిదొంగ హీరోయిన్ ఇంతలా మారిపోయిందేంటీ..!

దీపికకు అంతర్జాతీయ వెబ్ సిరీస్  ‘ది వైట్ లోటస్’ మూడవ సీజన్‌లో నటించే ఆఫర్ వచ్చింది. అయితే ఆమె గర్భవతి అయినందున అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సీజన్ మొదలయ్యే సరికి దీపికా డెలివరీ కూడా అయిపోతుంది. అయినా కూడా ఆమె నో చెప్పిందట.  పుట్టే బిడ్డకోసం దీపికా ఈ సిరీస్‌ను తిరస్కరించినట్లు సమాచారం. అలాగే దీపికా కొత్త ప్రాజెక్ట్ ఏదీ సైన్ చేయడం లేదని వార్తలు వచ్చాయి.

ఇది కూడా చదవండి : Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి అమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఈ స్టార్ హీరో ఎంట్రీ పక్క అంటగా..!

బాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. దీపిక ఎవరి సహాయం లేకుండా శిశువును చూసుకోవాలని కోరుకుంటుంది. అంటే దీపికా ఇతర సెలబ్రిటీలలా పాపను చూసుకోవడానికి నానీలను పెట్టుకోదట. అంతే కాదు తల్లి అయిన తర్వాత దీపిక తన భర్త రణవీర్ సింగ్ తో కలిసి తమ బిడ్డను పూర్తిగా తామే చూసుకోవాలనుకుంటుందట. బిడ్డ పుట్టిన తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి బిడ్డతో ఎక్కువ సమయం సంతోషంగా గడపాలని అనుకుంటుందట దీపికా. అంటే ఇప్పట్లో దీపికా సినిమాలు ఉండకపోవొచ్చు .. ఇది నిజంగా అభిమానులకు బ్యాడ్ న్యూసే అని చెప్పాలి.

దీపికకు పిల్లలంటే చాలా ఇష్టం. ఇది ఆమె మొదటి మాతృత్వం. దాంతో దీపిక బేబీపై ఎక్కువ శ్రద్ధ చూపుతోంది. తొలిసారి మాతృత్వాన్ని ఆస్వాదించాలని ఆరాటపడుతోంది. దీపికా పదుకొణె తన గర్భాన్ని మార్చి నెలలో సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ప్రత్యేకమైన పోస్ట్‌ను పంచుకుంటూ, ఇద్దరూ తమ అభిమానులతో ఆనందాన్ని వెల్లడించారు. అంతేకాకుండా, దీపిక చాలా చోట్ల తన బేబీ బంప్‌తో కనిపించింది. ఓ పాత ఇంటర్వ్యూలో దీపికా తల్లి కావాలనే కోరికను వ్యక్తం చేసింది. ‘నేను ముగ్గురు పిల్లలకు తల్లిని కావాలనుకుంటున్నాను’ అని చెప్పింది. అంతే కాదు దీపికాతో పెళ్లి తర్వాత ఓ కూతురికి తండ్రి కావాలనే కోరికను రణ్‌వీర్ బయటపెట్టాడు. ఇప్పుడు ఈ ఇద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి