28 February 2025
వివాదాలు, ట్రోలింగ్‌తో ఫేమస్.. 251 జంటలకు పెళ్లిళ్లు చేసిన హీరోయిన్
Rajitha Chanti
Pic credit - Instagram
ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. కానీ ఆ తర్వాత స్పెషల్ పాటలతో పాన్ ఇండియా క్రేజ్ అందుకుంది ఈ హీరోయిన్.
నిత్యం వివాదాలు, ట్రోలింగ్స్ కారణంగా వార్తలలో నిలుస్తుంటుంది. ఇటీవల ఓ స్టార్ హీరో ఆరోగ్యం గురించి మాట్లాడి మరోసారి ట్రోలింగ్ బారిన పడింది.
ఆమె ఎవరో కాదు.. హీరోయిన్ ఊర్వశి రౌతేలా. హిందీ, తెలుగు భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఇటీవలే బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాతో అభిమానులను అలరించింది. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన చిత్రంలో కీలకపాత్రలో నటించింది.
అలాగే భారత్, పాక్ క్రికెట్ మ్యాచ్ లో మెరిసిం మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించి ఓ న్యూస్ వైరలవుతుంది.
ఊర్వశి రౌతేలా ఫౌండేషన్ తరపున అనాథలైన అమ్మాయిలకు సామూహిక వివాహాలు జరిపించింది. ఈ మహోన్నత కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్రమోది హాజరయ్యారు.
అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు ఆశీర్వదించారు. దాదాపు 251 జంటలకు వివాహం జరిపించారు.
అంతేకాదు.. తానే స్వయంగా వారికి భోజనాలు కూడా వడ్డించింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్