నటసింహం నందమూరి బాలకృష్ణ క్రేజ్, ఆయన రేంజ్ గురిని ప్రత్యేకంగా చెప్పాలిసిన పనిలేదు. యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన సినిమా వస్తుందంటే చాలు బాలయ్య ఫ్యాన్స్ కు పండగే. ఇప్పటికే అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న బాలయ్య రీసెంట్ గా వీరసింహారెడ్డి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించి బాలయ్య అందరిని ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా భగవంత్ కేసరి అనే టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది.
ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమా శ్రీలీల కూడా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన కాజల్ లుక్ ప్రేక్షకులను మెప్పించింది. అయితే దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా అప్డేట్స్ వెరైటీగా ఇస్తున్నారు అనిల్ రావిపూడి.
మొన్నామధ్య అనిల్ రావిపూడి డాన్స్ స్టెప్పులతో అదరగొట్టారు. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఆకట్టుకున్నారు. ఈసారి హీరోయిన్స్ కాజల్, శ్రీలీల ఇద్దరు కలిసి బాలయ్య సాంగ్ కు డాన్స్ చేశారు. బాలకృష్ణ చికలపచ్చ కొక పాటకు కాజల్, శ్రీలీల డాన్స్ చేశారు. ఈ వీడియోలో అనిల్ రావిపూడి కూడా కనిపించారు. పెళ్ళై, బిడ్డ పుట్టిన తర్వాత కూడా కాజల్ అదే ఎనర్జీతో కనిపించి ఆకట్టుకున్నారు.
#BhagavanthKesari #KajalAggarwal #Sreeleela pic.twitter.com/VLi6cioaMS
— ???????? ????? (@BheeshmaTalks) June 19, 2023