Kajal Aggarwal : అందాల చందమామ ముద్దుల కొడుకు పేరు ఏంటో తెలుసా..

అందాల చందమామ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal )పండంటి మగబిడ్డకు జన్మనిచిన విషయం తెలిసిందే. మంగళవారం(ఏప్రిల్ 19న) ఉదయం 7గంటలకు ముంబయ్‏లోని ఓ ప్రవేట్ హాస్పిటల్ లో మగబిడ్డ జన్మనిచింది.

Kajal Aggarwal : అందాల చందమామ ముద్దుల కొడుకు పేరు ఏంటో తెలుసా..
Kajal

Updated on: Apr 20, 2022 | 12:32 PM

అందాల చందమామ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal )పండంటి మగబిడ్డకు జన్మనిచిన విషయం తెలిసిందే. మంగళవారం(ఏప్రిల్ 19న) ఉదయం 7గంటలకు ముంబయ్‏లోని ఓ ప్రవేట్ హాస్పిటల్ లో మగబిడ్డ జన్మనిచింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కాజల్ అక్టోబర్ 30, 2020న తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంది. కోవిడ్ కారణంగా కుటుంబసభ్యులు అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ టాలీవుడ్ చిత్రాల నుంచి తప్పుకున్న సంగతి తెలసిందే. తాజాగా కాజల్ కొడుకు గురించి అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. కాజల్ దంపతులు తమ కొడుకును ఎప్పుడు పరిచయం చేస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా తమ కొడుకు పేరును రివీల్ చేశారు కాజల్, గౌతమ్. తమ ముద్దుల కొడుకుకు నీల్ కిచ్లు(Neil Kitchlu)అనే పేరును ఖరారు చేశారు. ఈ పేరును సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కాజల్ భర్త గౌతమ్ తమ కొడుకు పేరు నీల్ కిచ్లు అని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. దాంతో అభిమానులు, పలువురు సెలబ్రెటీలు కాజల్ దంపతులకు విషెస్ తెలుపుతున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలోనూ కాజల్ వరుస ఫోటోషూట్స్.. ప్రెగ్నెన్సీ ప్రకటనలలో నటిస్తూ బిజీగా గడిపేసింది. ఇప్పుడు మాతృత్వంలోని మాధుర్యాన్ని అనుభవిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Netflix: నెట్‌ఫ్లిక్స్‌ సంచలన నిర్ణయం.. యూజర్లకు షాక్ ఇచ్చిన ఓటీటీ ప్లాట్ ఫామ్.

Ante Sundaraniki Teaser : సుందరానికి చెప్పుకోలేని కష్టాలు.. అంటే…! ఆకట్టుకుంటున్న టీజర్

Allu Arjun: ఆ కమర్షియల్‌ యాడ్‌లో నటించేందుకు నో చెప్పిన బన్నీ.. ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్‌..