Kajal Agarwal : కమల్ హాసన్ అసంతృప్తిపై కారణాలేంటి..? ఇండియన్-2 పై క్లారిటీ ఇచ్చిన కథానాయిక..

Kajal Agarwal Clarity on Indian-2 : కమల్ హాసన్ హీరోగా డైరక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్-2 సినిమా షూటింగ్‌లో భారీ ప్రమాదం

Kajal Agarwal : కమల్ హాసన్ అసంతృప్తిపై కారణాలేంటి..?  ఇండియన్-2 పై క్లారిటీ ఇచ్చిన కథానాయిక..
Kajal Agarwal

Updated on: Mar 17, 2021 | 4:25 PM

Kajal Agarwal Clarity on Indian-2 : కమల్ హాసన్ హీరోగా డైరక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్-2 సినిమా షూటింగ్‌లో భారీ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. చెన్నై సమీపంలోని పూనమల్లి దగ్గర షూటింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ భారీ క్రేన్.. సడన్‌గా పడిపోవడంతో.. ముగ్గురు మృతి చెందగా.. 10 మంది గాయాలపాలయ్యారు. మృతిచెందిన వారిలో ఇద్దరు మధు, చంద్రన్ (ఫుడ్ ప్రోవైడర్స్) కాగా.. మరోకరు అసిస్టెంట్ డైరక్టర్ కృష్ణ ఉన్నారు.

దీంతో ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. దీనికితోడు కరోనా మహమ్మారి అధికం కావడంతో సినిమా గురించి మాట్లాడేవారే కరువయ్యారు. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న కాజల్ అగర్వాల్ సినిమా గురించి స్పందించారు. మోస‌గాళ్లు ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా కాజ‌ల్ మాట్లాడుతూ.. దుర‌దృష్ట‌వ‌శాత్తు చాలా కార‌ణాల వ‌ల్ల ఇండియన్ 2 మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. నిర్మాత‌లు, డైరెక్ట‌ర్ మ‌ధ్య విబేధాలున్న‌ట్టు వార్త‌ల్లో కూడా వ‌చ్చింది. అదే స‌మ‌యంలో క్రేన్ ప్ర‌మాదం జరగడంతో క‌మ‌ల్‌హాస‌న్ బ‌హిరంగంగా నిర్మాణ సంస్థ తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేశార‌ని చెప్పుకొచ్చింది.

అయితే కమల్ సార్ త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో క‌మ‌ల్‌హాస‌న్ మ‌క్క‌ల్ నీధి మ‌య్యం పార్టీ కార్య‌క‌లాపాల‌తో బిజీగా ఉన్నారు. మ‌రి ఇండియ‌న్ 2 సినిమా ఇప్ప‌ట్లో వ‌స్తుందా..? అస‌లు సినిమానే ఉండ‌దా..? అనేది తెలియాల్సి ఉందని బదులిచ్చింది. అంతేకాకుండా ఈ సినిమా యూనిట్ మెంబర్స్ యూస్ వ్యక్తులు కావడంతో ఇప్పట్లో సినిమా షూటింగ్ జరిగేలా కనిపించడం లేదని వెల్లడించింది. కాగా లైకా ప్రొడ‌క్ష‌న్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Tenali Corona Cases: గుంటూరు జిల్లాలో కరోనా కల్లోలం.. తెనాలిలో ఒక్క రోజే ప్రమాదకరంగా నమోదైన కేసులు

విశాఖపట్నంలో అగ్ని ప్రమాదం.. అపార్ట్‌మెంట్‌లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌..

Singer Sunitha Looks Stylish: మాల్దీవుల్లో సింగర్ సునీత దంపతులు.. ఎన్నడూ చూడని లుక్ లో సునీత