Hema Committee: మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఇంత జరుగుతోందా? హేమ కమిటీ నివేదికలో సంచలన విషయాలు

|

Aug 20, 2024 | 8:40 AM

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటోన్న లైంగిక వేధింపులపై అధ్యయనం చేసిన జస్టిస్ హేమ కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సమర్పించింది. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ నటిపై స్టార్ నటుడు, అతని అనుచరులు అత్యాచారానికి ప్రయత్నించడంతో 2017లో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.

Hema Committee: మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఇంత జరుగుతోందా? హేమ కమిటీ నివేదికలో సంచలన విషయాలు
Justice Hema Committee
Follow us on

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటోన్న లైంగిక వేధింపులపై అధ్యయనం చేసిన జస్టిస్ హేమ కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సమర్పించింది. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ నటిపై స్టార్ నటుడు, అతని అనుచరులు అత్యాచారానికి ప్రయత్నించడంతో 2017లో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీకి ఛైర్‌పర్సన్‌గా జస్టిస్ హేమ (మాజీ హైకోర్టు న్యాయమూర్తి), ప్రముఖ సీనియర్ నటి శారద, కేబీ వల్సల కుమారి తదితరులు ఉన్నారు. కమిటీ నివేదికను 2019లోనే ప్రభుత్వానికి సమర్పించారు, అయితే నివేదికలో సున్నితమైన అంశాలు ఉన్నందున ప్రభుత్వం దానిని బహిర్గతం చేయలేదు. పపలు ఆర్టీఐ దరఖాస్తులు, కోర్టు ఆదేశాల తర్వాత ఇప్పుడు ఈ కమిటీ నివేదికలోని విషయాలు బయటకు వచ్చాయి. కాగా మలయాళ చిత్ర పరిశ్రమలోని చీకటి కోణాన్ని హేమ రిపోర్ట్‌లో తేలింది. చాలా మంది నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను ఇందులో పొందు పరిచారు. నటీమణులు అవుట్ డౌర్ షూటింగుకు వెళ్లినప్పుడు వారు బస చేసే హోటల్ గదుల తలుపులను మగవాళ్లు కొడతారని, అప్పటికి వారంతా బాగా తాగి ఉంటారని, అసభ్యంగా ప్రవర్తించడం వంటివి చేస్తారని ఈ కమిటీ నివేదికలో తేలింది. ఈ కారణంగానే బయట షూటింగ్‌లకు వెళ్లకున్నా.. కుటుంబాన్ని కూడా వెంట తీసుకెళ్తామని కొందరు నటీమణులు చెప్పారు.

నివేదికలో పేర్కొన్నట్లుగా, మొత్తం మలయాళ చిత్ర పరిశ్రమ కొంతమంది పురుషుల చేతుల్లో ఉంది. కొందరు స్టార్ యాక్టర్లు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సినిమా ఇండస్ట్రీని నడుపుతున్నారు. ఇది ఒక రకమైన పవర్ హౌస్ వ్యవస్థ. నటీమణులు తమకు అవకాశాలు వస్తాయని, వారితో ‘మంచి’గా ఉంటే కొత్త సినిమాలు, మంచి రెమ్యునరేషన్ లభిస్తాయని రిపోర్టులో పేర్కొంది. సినీ పరిశ్రమలో నటీమణులు లైంగిక వేధింపులు, అవమానాలు ఎదుర్కొంటున్నారు. కొందరు మగవాళ్లు అనవసరంగా అడ్వాన్స్ డబ్బులు ఇస్తూ, పరోక్షంగా ‘అడ్జస్ట్ మెంట్ ‘ అడుగుతున్నారు. వినకపోతే అవకాశాలు రావంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. మలయాళ సినిమాల్లో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయని ఈ నివేదిక తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఇందులోని విషయాలు సంచలనంగా మారాయి. హేమ నివేదిక వెలువడిన తర్వాత, సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసేందుకు అన్ని భారతీయ చిత్ర పరిశ్రమల్లో ఇలాంటి కమిటీలు వేయాలన్న వాదన ఇప్పుడు వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.