Amigos Pre Release Event: అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు తమ్ముడు వస్తున్నాడు.. క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్ రామ్..
ఇప్పటికే విడుదలైన ‘అమిగోస్’ మూవీ టీజర్, సాంగ్స్‌కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చాయి. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్‌ను కర్నూలులో చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో నందమూరి కళ్యాణ్ రామ్ , నిర్మాత యలమంచిలి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
డిఫరెంట్ చిత్రాలు, విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన త్రిపాత్రిభినయంలో నటించిన చిత్రం ‘అమిగోస్’. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈసినిమాకు రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 10న గ్రాండ్ లెవల్లో రిలీజ్ అవుతుంది. సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘అమిగోస్’ మూవీ టీజర్, సాంగ్స్‌కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చాయి. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్‌ను కర్నూలులో చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో నందమూరి కళ్యాణ్ రామ్ , నిర్మాత యలమంచిలి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నారంటూ క్లారిటీ ఇచ్చారు కళ్యాణ్ రామ్.
హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘‘2022లో బింబిసార సినిమాతో మీ ముందుకు వచ్చాను. ఆ సినిమాకు మీరు చూపించిన ఆదరాభిమానాలు చూసి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కొత్త సినిమాలను చేసిన ప్రతీసారి ప్రేక్షకులు ఆదరిస్తూనే వచ్చారు. అలాగే అమిగోస్ అంటే ఫ్రెండ్స్ అని అర్థం. తాతగారు రాముడు భీముడు చేశాడు. తర్వాత బాబాయ్ చేశాడు. తర్వాత తమ్ముడు జై లవకుశ చేశాడు. ఇవన్నీ అన్నదమ్ముల మధ్య కథ. అయితే అమిగోస్ మనుషులను పోలిన మనుషులు ఏడుగురుంటారని తెలుసు.
అలాంటి ముగ్గురు మధ్య జరిగే కథ. థియేటర్‌లో మీరు డిసప్పాయింట్ కారు. మీరు మాపై చూపించే అభిమానానికి ఇంకో సూపర్ హిట్ సినిమా రాబోతుంది. ఫిబ్రవరి 10న మూవీ మీ ముందుకు రానుంది. ఎల్లుండి జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తమ్ముడు గెస్ట్‌గా వస్తున్నాడు. జై ఎన్టీఆర్, జై హరికృష్ణ, జై హింద్’’ అన్నారు.