Balakrishna-Jr.NTR: ఒకే వేదికపై జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ.. మరోసారి కలిసి కనిపించనున్న అబ్బాయ్, బాబాయ్ !

|

Aug 28, 2023 | 8:20 AM

ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్ కుమారులు, కూతుళ్లతోపాటు మిగతా కుటుంబసభ్యులు అంతా ఢిల్లీకి చేరుకున్నారు. ఆదివారం రాత్రే టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నందమూరి కుటుంబసభ్యులందరికీ కేంద్రం ఢిల్లీకి ఆహ్వనించింది. ఆహ్వానితుల్లో చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరి, నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ పేర్లు ప్రస్తావించారు.

Balakrishna-Jr.NTR: ఒకే వేదికపై జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ.. మరోసారి కలిసి కనిపించనున్న అబ్బాయ్, బాబాయ్ !
Balakrishna, Jrntr
Follow us on

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్బంగా కేంద్ర ప్రభుత్వం ఆయన పేరిట వంద రూపాయాల నాణేన్ని ముద్రించిన సంగతి తెలిసిందే. సోమవారం (ఆగస్ట్ 28న) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ నాణెంను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా ఢిల్లీకి పయనమయ్యారు. ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్ కుమారులు, కూతుళ్లతోపాటు మిగతా కుటుంబసభ్యులు అంతా ఢిల్లీకి చేరుకున్నారు. ఆదివారం రాత్రే టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నందమూరి కుటుంబసభ్యులందరికీ కేంద్రం ఢిల్లీకి ఆహ్వనించింది. ఆహ్వానితుల్లో చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరి, నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ పేర్లు ప్రస్తావించారు. ఇక మిగతా వారికి మాత్రం ఆహ్వానం అందినట్లుగా కనిపించడం లేదు.

అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారా ?లేదా ?అనేది అభిమానులు నెలకొన్న సందేహం. ఒకవేళ తారక్ వెళ్తే.. వీరిద్దరు కలిసి ఒకే వేదికపై కనిపించడం మాత్రం ఖాయం. ఇక ఇదే జరిగితే నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతారు. తారక్, బాలకృష్ణ కలిసి కనిపించడం చాలా అరుదు. ఇటీవల కొంత కాలంగా వీరిద్దరి మధ్య దూరం పెరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణాలు లేకపోలేదు. గతంలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు తారక్ హజరుకాలేదు. అంతకు ముందు తారకరత్న సంస్కరణ సభలోనూ వీరిద్దరూ దూరంగానే ఉన్నారు. దీంతో వీరిద్దరి మధ్య దూరం వచ్చిందనే వార్తలు వినిపించాయి.

ఇవి కూడా చదవండి

కానీ ఇటీవల జరిగిన నందమూరి సుహాసిని కుమారుడి పెళ్లిలో నందమూరి కుటుంబం మొత్తం సందడి చేసింది. ఈ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మోక్షజ్ఞ ఎంతో సరదాగా మాట్లాడుతూ కనిపించారు. ఇక మోక్షజ్ఞను తారక్ ఆప్యాయంగా హత్తుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరలయ్యింది. అందులో మోక్షజ్ఞ మనస్పూర్తిగా చిరునవ్వులు చిందిస్తూ కనిపించగా.. వెలకట్టలేని క్షణమంటూ తన ట్విట్టర్ వేదికగా షేర్ చేయడంతో క్షణాల్లోనే వైరలయ్యింది. ఇక ఆ ఫోటో చూసిన నందమూరి అభిమానులు సంతోషపడ్డారు. ఇక ఇప్పుడు మరోసారి బాలయ్య, తారక్ కలిసి ఓ వేదికపై కనిపించనుండడంతో అభిమానులలో ఆసక్తి నెలకొంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.