Devara Movie: దేవర స్టోరీ లీక్.. పదివేల మందితో యాక్షన్ సీన్.. తారక్ యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్..

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. బీటౌన్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి జాన్వీ, తారక్, సైఫ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ కాగా.. ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాన్ ఇండియా లెవల్లో రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. దేవర ఫస్ట్ పార్ట్ దసరా కానుకగా అక్టోబర్ 10న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ మూవీ గురించి నిత్యం ఏదోక వార్త నెట్టింట హల్చల్ చేస్తుంటుంది.

Devara Movie: దేవర స్టోరీ లీక్.. పదివేల మందితో యాక్షన్ సీన్.. తారక్ యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్..
Devara
Follow us
Rajitha Chanti

|

Updated on: May 25, 2024 | 11:44 AM

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తు్న్నారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఎంతో జాగ్రత్తగా రూపొందిస్తున్న ఈ మాస్ యాక్షన్ మూవీలో ఎన్టీఆర్ ఊర మాస్ రగ్గడ్ లుక్‏లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. బీటౌన్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి జాన్వీ, తారక్, సైఫ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ కాగా.. ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాన్ ఇండియా లెవల్లో రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. దేవర ఫస్ట్ పార్ట్ దసరా కానుకగా అక్టోబర్ 10న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ మూవీ గురించి నిత్యం ఏదోక వార్త నెట్టింట హల్చల్ చేస్తుంటుంది.

తాజాగా దేవర సినిమా స్టోరీ మొత్తాన్ని ఓ జూనియర్ ఆర్టిస్ట్ లీక్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సదరు జూనియర్ ఆర్టిస్ట్ దేవర సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేశాడు. ఈ క్రమంలోనే దేవర కథ కూడా చెప్పినట్లు సమాచారం. దేవర సినిమాలో రౌడీల్లో ఒక వ్యక్తిగా నటించిన ఆ జూనియర్ ఆర్టిస్ట్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ సముద్రం దగ్గర ఉండే పది ఊర్లకు కాపరిగా ఉంటాడని.. వారికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ముందుండి వారిని రక్షిస్తాడని తెలిపాడు. అందరికి అండగా నిలబడే వ్యక్తి అని.. సముద్రం దగ్గర ఫైట్ సీన్ ఉంటుందని.. అందర్నీ నరికే సీన్ హైలెట్ అని అన్నాడు.

ఆ సీన్ కోసం ఏకంగా పదివేల మందితో ఫైట్ చేస్తాడని.. దీంతో సముద్రం అంతా రక్తంతో నిండిపోతుందని.. యాక్షన్ సీన్స్ లైవ్ లో చూసి తాము షాకయ్యామని.. తారక్ యాక్టి్ంగ్ నిజంగానే మైండ్ బ్లోయింగ్ అని తెలిపాడు. సింగిల్ టేక్ లో డైలాగ్ చెప్పడం తారక్ స్టైల్ అని.. దేవర రిలీజ్ అయిన తర్వాత థియేటర్స్ బద్దలైపోవడం ఖాయమంటూ ఓ రేంజ్ ఎలివేషన్ ఇస్తూ కథ మొత్తం లీక్ చేశాడు. దీంతో తారక్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. విడుదలకు ముందే స్టోరీ ఎందుకు లీక్ చేశావంటూ సదరు జూనియర్ ఆర్టిస్ట్ పై మండిపడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.