
జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర: పార్ట్ 1 కోసం నందమూరి ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. దాంతో ఇప్పుడు దేవర సినిమాను కూడా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ మూవీలో పవర్ ఫుల్ విలన్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా గురించిన కొత్త అప్‌డేట్ ఒకటి ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
ఇటీవలే ‘దేవర’ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో విడుదలైంది. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘ఫియర్..’ అనే పాటను విడుదల చేశారు. ఈ సినిమా ఫుల్ ఆల్బమ్ రిలీజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా నుంచి వైరల్ అవుతున్న వార్త ఏంటంటే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ 10 వేల మందితో ఫైట్ చేయబోతున్నాడని అంటున్నారు.
ఇంత మందిని ఏకతాటిపైకి తీసుకురావడం చిన్న విషయం కాదు. దీన్ని కెమెరాలో బంధించడం కూడా పెద్ద సవాలే. మరి దర్శకుడు కొరటాల శివ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. ‘దేవర’ సినిమా సముద్ర నేపథ్యంలో సాగే కథ. ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని యాక్షన్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. ‘దేవర’ సినిమాలో బరో నిధిని దోచుకునే సీన్‌లో జూనియర్ ఎన్టీఆర్ 10 వేల మందితో ఫైట్ చేయబోతున్నాడని అంటున్నారు. ఈ సీన్ సినిమాకే హైలైట్ అవుతుందని ఇన్ సైడ్ టాక్. దేవర గ్లింప్స్‌లో ‘ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువ చూసింది’ అనే డైలాగ్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించింది. దీంతో సినిమాపై క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పుడు పదివేల మందితో ఫైట్ అని తెలిసి అభిమానులు మరింత థ్రిల్‌గా ఫీల్ అవుతున్నారు. ఈ సినిమా OTT హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. 155 కోట్లకు OTT హక్కులు అమ్ముడుపోయినట్లు టాక్. అక్టోబర్ 10న సినిమా థియేటర్లలో విడుదలవుతోంది దేవర సినిమా.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.