ఈ బుడ్డోడు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో.. బుల్లితెర పైనా దమ్ము చూపించాడు.. గుర్తుపట్టండి ఎవరో..

|

Jul 24, 2021 | 2:07 PM

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పలువురు స్టార్స్‎కు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే సోషల్ మీడియా ద్వారా అభిమానులు

ఈ బుడ్డోడు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో.. బుల్లితెర పైనా దమ్ము చూపించాడు.. గుర్తుపట్టండి ఎవరో..
Celebs
Follow us on

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పలువురు స్టార్స్‎కు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే సోషల్ మీడియా ద్వారా అభిమానులు అడగడంతో తమ వ్యక్తిగత విషయాలను, చిన్ననాటి జ్ఞాపకాలను షేర్ చేసుకుంటున్నారు. ఇప్పటికే రష్మిక, రకుల్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ చిన్ననాటి ఫోటోలు నెట్టింట్లో సందడి చేస్తున్నారు. తాజాగా మరో స్టార్ హీరో చిన్ననాటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అదే పైన కనిపిస్తున్న ఫోటో. అందులో బ్లాక్ డ్రెస్‏లో ఉన్న క్యూట్ బాయ్ ఇప్పుడు టాలీవుడ్‏లో టాప్ హీరోలలో ఒకరు. ఆయనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

చైల్డ్ ఆర్టిస్ట్‏గా సినీరంగ ప్రవేశం చేసిన ఈ కుర్రాడు.. ఇప్పుడు టాప్ హీరో. ప్రస్తుతం ఈ చిన్నారి.. ఇప్పుడు వరుస సినిమాలను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. పాన్ ఇండియా లెవల్లో సినిమాలు చేస్తూ ఆల్ టైం బిజీగా గడిపేస్తున్నాడు. గుర్తుపట్టండి చూద్దాం. మీకు ఇంకో విషయం.. టైటిల్ లోనే క్లూ కూడా ఉంది.. ఆలోచించండి.

పైన రెండు ఫోటోలలో ఉన్న క్యూట్ బాయ్ అసలు పేరు నందమూరి తారక రామ రావు. అందరూ అతడిని జూనియర్ ఎన్టీఆర్ అని పిలుస్తుంటారు. ఇప్పటికైనా గుర్తుపట్టారా. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నాడు.

ట్వీట్..

Also Read: Prabhas: ఎట్టకేలకు సెట్స్ పైకి ప్రభాస్ కొత్త సినిమా.. పూజా కార్యక్రమాలకు వచ్చిన అమితాబ్..

Aamir Khan: విడిపోయారు.. కానీ కలిసే కనిపిస్తున్నారు.. అర్థం కానీ అమీర్ ఖాన్, కిరణ్ రావు తీరు.. వీడియో వైరల్..

DilRaju: రామ్ చరణ్.. శంకర్ సినిమా మొదలయ్యేది అప్పుడే.. మూవీ అప్‏డేట్స్ చెప్పిన బడా ప్రొడ్యుసర్..