యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఆయన ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు తారక్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో కొమురం భీమ్ గా తారక్ అద్భుత నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇక మన దగ్గర ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉంటారో అందరికి తెలుసు. ఆయన డాన్స్ కు, డైలాగ్ డెలివరీకి, స్టైల్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తారక్ సినిమాలతో పాటు ఈ మధ్య టీవీ షోలతో కూడా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 1కు హోస్ట్ గా వ్యవహరించి అలరించారు. తన మాటలతో ప్రేక్షకులను మెప్పించారు తారక్. అలాగే ఎవరు మీలో కోటీశ్వరులు అనే షోలో కూడా అలరించారు తారక్. అదేవిధంగా పలు వాణిజ్యప్రకటనలలో కూడా కనిపించారు. తాజాగా మరోసారి యాడ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
తాజాగా ఈ యాడ్ కు సంబంధించిన షూటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ యాడ్ లో తారక్ సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఇక ఈ యాడ్ లో ఒక కోర్ట్ సీన్ ను తెరకెక్కించారు. అయితే ఈ యాడ్ లో ఒక చిన్న డైలాగ్ చెప్పాల్సి ఉంటుంది.. కానీ తారక్ చాలా టెక్స్ తీసుకుంటారు. దాంతో ఎదురుగా ఉన్న రాహుల్ రామకృష్ణ ఆరు పేజీల డైలాగ్ ను సింగిల్ టెక్ లో చెప్తారు. ఈ చిన్న డైలాగ్ చెప్పలేక పోతున్నారేంటి అని ప్రశ్నిస్తాడు..దానికి తారక్.. ‘‘చేప చిన్నదే అయినా ఎర పెద్దది వెయ్యాలి’’ అని డైలాగ్ చెప్తాడు.
ఆతర్వాత డైలాగ్ చిన్నదే అయినా.. డైలెక్ట్ పర్ఫెక్ట్‌గుండాలి’’.. అంటూ తారక్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఇక ఈ యాడ్ మీకింగ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక తారక్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు యంగ్ టైగర్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవనుంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ మొన్నామధ్య విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.