AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr. NTR: ‘నా కళ్ల వెంట వచ్చిన ప్రతి కన్నీటి చుక్కకు వాళ్లు బాధ పడ్డారు’.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్..

ప్రస్తుతం యంగ్ టైగర్ దేవర చిత్రంలో నటిస్తున్నారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న మాస్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది జాన్వీ. ఇప్పటికే ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ బజ్ నెలకొంది. కొద్దిరోజులుగా ఈ మూవీ యాక్షన్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం తారక్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లారు. శుక్రవారం దుబాయ్ లో జరిగిన సైమా 2023 వేడుకల్లో పాల్గొన్నారు తారక్.

Jr. NTR: 'నా కళ్ల వెంట వచ్చిన ప్రతి కన్నీటి చుక్కకు వాళ్లు బాధ పడ్డారు'.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్..
Jr Ntr Speech
Rajitha Chanti
|

Updated on: Sep 16, 2023 | 9:04 AM

Share

జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. వరల్డ్ వైడ్‏గా ప్రాణాలిచ్చే అభిమానులున్నారు. తారక్ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాపంగా క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం యంగ్ టైగర్ దేవర చిత్రంలో నటిస్తున్నారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న మాస్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది జాన్వీ. ఇప్పటికే ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ బజ్ నెలకొంది. కొద్దిరోజులుగా ఈ మూవీ యాక్షన్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం తారక్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లారు. శుక్రవారం దుబాయ్ లో జరిగిన సైమా 2023 వేడుకల్లో పాల్గొన్నారు తారక్.

ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో నటనకుగానూ ఉత్తమ నటుడిగా సైమా 2023 అవార్డ్ అందుకున్నారు తారక్. సౌత్ ఇండస్ట్రీలోని అత్యుత్తమ చిత్రాలకు ప్రతి సంవత్సరం సైమా అవార్డ్స్ అందిస్తుంటారు. దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న ఈ వేడుకలు ఇప్పుడు 11వ వసంతంలోకి అడగుపెట్టాయి. సెప్టెంబర్ 12, 13 తేదీలలో సైమా అవార్డ్ ప్రధానోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. మొదటి రోజు తెలుగుతోపాటు కన్నడ చిత్రాలకు, నటీనటులకు అవార్డ్స్ ప్రదానం చేశారు. ఈ వేడుకలలో ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు తారక్. అవార్డ్ స్వీకరిస్తు్న్న ఫోటోస్, వేదికపై ఆయన స్పీచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

అవార్డ్ అందుకున్న తర్వాత తారక్ మాట్లా్డుతూ..”నా ఒడిదుడుకుల్లో, నేను క్రిందపడ్డప్పుడెళ్ళా నన్ను పట్టుకుని పైకి లేపినందుకు, నా కనుల వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకి వాళ్ళు కూడా భాద పడినందుకు, నేను నవ్వినప్పుడెళ్ళ నాతో పాటు వాళ్ళు కూడా నవ్వినందుకు, నా అభిమాన సొదరులందరికి పాదాభి వందనాలు” అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు.

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
షాకింగ్‌ న్యూస్‌.. పెరగనున్న మందుల ధరలు.. ఏయే టాబ్లెట్స్‌ అంటే..!
షాకింగ్‌ న్యూస్‌.. పెరగనున్న మందుల ధరలు.. ఏయే టాబ్లెట్స్‌ అంటే..!
Shukra Gochar: ఈ రాశులకు చెందిన మహిళలకు లక్ష్మీ కటాక్షం..!
Shukra Gochar: ఈ రాశులకు చెందిన మహిళలకు లక్ష్మీ కటాక్షం..!
బయటకెళ్దామని బండి తీశాడు.. తాళం ఆన్ చేస్తుండగా కనిపించింది చూసి..
బయటకెళ్దామని బండి తీశాడు.. తాళం ఆన్ చేస్తుండగా కనిపించింది చూసి..
సింగిల్‌గానే ఫుల్ హ్యాపీ అంటున్న హన్సిక..
సింగిల్‌గానే ఫుల్ హ్యాపీ అంటున్న హన్సిక..
అనాథాశ్రమంలో పెరిగింది.. రెండేళ్లు పానీపూరితో ఆకలి తీర్చుకుంది
అనాథాశ్రమంలో పెరిగింది.. రెండేళ్లు పానీపూరితో ఆకలి తీర్చుకుంది
బంగారం వేసుకుంటే ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఖాయం
బంగారం వేసుకుంటే ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఖాయం
హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే మీ జేబుకు చిల్లే
హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే మీ జేబుకు చిల్లే
ఒంటిపై 250 టాటూలు..భర్త వికృత చేష్టలకు బలైపోయిన మహిళ కథ!
ఒంటిపై 250 టాటూలు..భర్త వికృత చేష్టలకు బలైపోయిన మహిళ కథ!
కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం
కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం
మీరు కారుకు ఇలాంటి డోర్ హ్యాండిల్స్ ఉన్నాయా? అయితే జాగ్రత్త
మీరు కారుకు ఇలాంటి డోర్ హ్యాండిల్స్ ఉన్నాయా? అయితే జాగ్రత్త