Devara Movie: 35 రోజులు నీళ్లలోనే.. 15 సెకండ్స్ సీన్ కోసం రోజంతా షూటింగ్.. దేవర యాక్షన్ కోసం తారక్ కష్టం..
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే దేవర టీమ్ ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఇటీవలే దేవర టీమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో కలిసి స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే ఈ సినిమాలో ఆఖరి 40 నిమిషాల యాక్షన్ సీన్ గురించి కూడా చెప్పుకొచ్చారు.
సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న ‘దేవర’ మరికొన్ని రోజుల్లో అడియన్స్ ముందుకు రాబోతుంది. సెప్టెంబర్ 27న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలోనూ విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. దేవర రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే దేవర టీమ్ ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఇటీవలే దేవర టీమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో కలిసి స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే ఈ సినిమాలో ఆఖరి 40 నిమిషాల యాక్షన్ సీన్ గురించి కూడా చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ..”అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఒక స్టూడియోలో పెద్ద వాటర్ ఫూల్ తయారు చేసాము. 200 వరకు మ్యాన్ మేడ్ వాటర్ ట్యాంక్స్ ఏర్పాటు చేశాము. 35 రోజులు నీటిలోనే షూట్ చేశాము. దేవరలో అదే చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్. సినిమాలో వాటర్ ఎలిమెంట్స్ చాలా వాడాము. ఆ యాక్షన్ సీక్వెన్స్ కోసం మోటార్ బోట్స్, అలలు రావడానికి మిషన్స్ ఇలా నిజంగా సముద్రంలో జరిగిన ఫైట్ లా కనిపించడానికి చాలా ఖర్చు పెట్టాము. యాక్షన్ సీన్స్ కోసం ఎంతో కష్టపడ్డాము. షార్క్ తో సీన్స్ అదిరిపోతాయి. ఒక్క 15 సెకండ్స్ సీన్ కోసం రోజంతా పట్టేది. నీళ్ల లోపల షూటింగ్ ఒక్కోసారి సరిగ్గా కనపడేది కాదు ” అంటూ ఆ సినిమాలో వచ్చే భారీ యాక్షన్ సీక్వెన్స్ గురించి చెప్పుకొచ్చారు. తారక్ చేసిన కామెంట్స్ తో మరోసారి దేవర సినిమాపై హైప్ పెరిగింది.
దేవర సినిమాలో భారీ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతుందని తెలుస్తోంది. ముఖ్యంగా షార్క్ తో సీన్ వేరేలెవల్ ఉంటుందని గతంలోనూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు ఎన్టీఆర్ చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో తారక్ సరసన జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.