Jr.NTR: మరోసారి బుల్లితెరపై అలరించనున్న ఎన్టీఆర్.. రియాల్టీ షో కోసం తారక్ ?..

|

May 05, 2023 | 8:47 AM

ప్రస్తుతం ఆయన డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వరలోనే సెకండ్ షెడ్యూల్ షూరు కానుంది. ఈ క్రమంలో తాజాగా తారక్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

Jr.NTR: మరోసారి బుల్లితెరపై అలరించనున్న ఎన్టీఆర్.. రియాల్టీ షో కోసం తారక్ ?..
Ntr
Follow us on

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‏ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తారక్ కోసం ప్రాణాలిచ్చే అభిమానులు ఉన్నాయి. ఆయన సినిమా కోసం వేయి కళ్లతో వెయిట్ చేస్తుంటారు నందమూరి ఫ్యాన్స్. కేవలం సినిమాలపరంగానే కాకుండా.. వ్యక్తిత్వంలోనూ తారక్ అంటే ఇష్టపడని వారుండరు. ఎన్టీఆర్ నటనకు భారతీయులే కాదు.. హాలీవుడ్ మేకర్స్.. విదేశీయులు సైతం ఫిదా అయ్యారు. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ అద్భుతం. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వరలోనే సెకండ్ షెడ్యూల్ షూరు కానుంది. ఈ క్రమంలో తాజాగా తారక్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

అదేంటంటే.. ఎన్టీఆర్ 30 తర్వాత తారక్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ మూవీ రాబోతుంది. ఈ సినిమా తర్వాత తారక్ మరోసారి బుల్లితెరపై సందడి చేయబోతున్నారు. ఓ రియాల్టీ షోతో ఆయన మళ్లీ తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నారట. అయితే ఈ రియాల్టీ షో గురించి ఇప్పటివరకు ఎలాంటి డీటైల్స్ బయటకు రాలేదు. కానీ ఈ షోకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అనౌన్స్ రానుందని… ఈషోతో అభిమానులకు మరింత చేరువ కానున్నాడు తారక్.

గతంలో తారక్.. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ హోస్ట్ గా చేసిన సంగతి తెలిసిందే. ఆయన బుల్లితెరపై సందడి చేయడం అదే తొలిసారి. అయినా.. తనదైన హోస్టింగ్.. కామెడీతో ప్రేక్షకులను అలరించాడు. నిజానికి బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం తారక్ అనే చెప్పుకొవాలి. అయితే ఎన్టీఆర్ మళ్లీ బుల్లితెరపై సందడి చేయనుండడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఎన్టీఆర్ 30 తర్వాత తారక్ మరో రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.