Jr.NTR: బెంగుళూరులో తారక్ సందడి.. ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టితో ఎన్టీఆర్.. కారణం ఇదే..

చాలా రోజులకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి కనిపించారు. వీరిద్దరు బేగంపేట్ ఎయిర్ పోర్టులో కలిసి కనిపించిన వీడియోస్ నెట్టింట వైరలవుతున్నారు. రామ్ చరణ్ అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ కోసం జామ్ నగర్ వెళ్లగా.. తారక్ బెంగుళూరు వెళ్లినట్లు తెలుస్తోంది. అఖ్కడ మైత్రి రవి, హోంబలే ఫిల్మ్స్ నిర్మాత విజయ్, హీరో రిషబ్ శెట్టి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‏తో కలిసి సందడి చేశారు.

Jr.NTR: బెంగుళూరులో తారక్ సందడి.. ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టితో ఎన్టీఆర్.. కారణం ఇదే..
Rishab Shetty, Ntr, Prashan
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 02, 2024 | 10:42 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా ఏ ఈవెంట్స్, ప్రైవేట్ పార్టీస్‏కు అటెండ్ కాకుండా ఈ మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. అయితే చాలా రోజులకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి కనిపించారు. వీరిద్దరు బేగంపేట్ ఎయిర్ పోర్టులో కలిసి కనిపించిన వీడియోస్ నెట్టింట వైరలవుతున్నారు. రామ్ చరణ్ అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ కోసం జామ్ నగర్ వెళ్లగా.. తారక్ బెంగుళూరు వెళ్లినట్లు తెలుస్తోంది. అఖ్కడ మైత్రి రవి, హోంబలే ఫిల్మ్స్ నిర్మాత విజయ్, హీరో రిషబ్ శెట్టి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‏తో కలిసి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే వీరంతా ఎందుకు కలిశారు అనే విషయాలు మాత్రం తెలియరాలేదు. ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వేడుకలో రిషబ్ శెట్టి, తారక్ మధ్య జరిగిన సీన్ గురించి చెప్పక్కర్లేదు. వీరిద్దరు స్టేజ్ పైనే కన్నడలో ఆప్యాయంగా పలకరించుకున్నారు.

అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ప్రశాంత్ నీల్ ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి తారక్ తన సతీమణి లక్ష్మి ప్రణతితో కలిసి వెళ్లినట్లుగా తెలుస్తోంద. ఇక అదే కార్యక్రమానికి కాంతార హీరో రిషబ్ శెట్టి తన కుటుంబంతో కలిసి వచ్చారు. అక్కడే వీరంతా కలిసి సరదాగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు అవే ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఇదిలా ఉంటే.. దేవర తర్వాత తారక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇటీవలే సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న నీల్.. ఇప్పుడు ఎన్టీఆర్ తో కలిసి చేయబోయే సినిమాపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఇటు దేవర సినిమాను రెండు పార్టులుగా తీసుకువస్తున్నారు డైరెక్టర్ కొరటాల శివ. ఈ ఏడాది వేసవిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. ఈ మూవీ రిలీజ్ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. దీంతో ప్రశాంత్ నీల్ సలార్ సెకండ్ పార్ట్ పూర్తి చేసే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. దేవర సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఒక్కప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒక్కప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు