Jr.NTR-Mokshagna: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. నందమూరి అభిమానుల కల నిజమైంది.. అన్నదమ్ములు ఆత్మీయ ఆలింగనం..

తాజాగా ఈ వార్తలకు చెక్ పెడుతూ బాలయ్య తనయుడు మోక్షజ్ఞ, తారక్, కళ్యాణ్ రామ్ కలిసి ఉన్న ఫోటోస్ నెట్టింట వైరలయ్యాయి. నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని కుమారుడు శ్రీహర్ష పెళ్లి వేడుకలో నందమూరి ఫ్యామిలీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Jr.NTR-Mokshagna: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. నందమూరి అభిమానుల కల నిజమైంది.. అన్నదమ్ములు ఆత్మీయ ఆలింగనం..
Jrntr Mokshagna

Updated on: Aug 24, 2023 | 3:50 PM

గత కొన్నాళ్లుగా నందమూరి ఫ్యామిలీ గురించి అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందని నెట్టింట ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. చాలాకాలంగా వీరంతా దూరంగా ఉంటున్నారని టాక్ నడిచింది. ఇక దివంగత నటుడు తారకరత్న సంతాపసభలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, బాలకృష్ణ మాట్లాడుకోకపోవడం.. వీరంతా ఎవరికీ వారు ఉన్నారంటూ ఓ వీడియో వైరలయ్యింది. ఆ తర్వాత స్వర్గీయ తారక రామారావు శత జయంతి వేడుకలకు ఎన్టీఆర్ హజరుకాకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. దీంతో బాలయ్య, ఎన్టీఆర్ మధ్య నిజంగానే దూరం పెరిగిందని అంతా అనుకున్నారు. అయితే ఈ వార్తలపై అటు తారక్, ఇటు బాలయ్య గానీ స్పందించలేదు.

తాజాగా ఈ వార్తలకు చెక్ పెడుతూ బాలయ్య తనయుడు మోక్షజ్ఞ, తారక్, కళ్యాణ్ రామ్ కలిసి ఉన్న ఫోటోస్ నెట్టింట వైరలయ్యాయి. నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని కుమారుడు శ్రీహర్ష పెళ్లి వేడుకలో నందమూరి ఫ్యామిలీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వేడుకలో ఎన్టీఆర్, మోక్షజ్ఞ, కళ్యాణ్ రామ్ కలిశారు. ఒకరితో ఒకరు సరదాగా నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో బాబాయ్, అబ్బాయ్ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవంటూ నందమూరి ఫ్యాన్స్ సంతోషపడ్డారు.

ఇక ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్‏కు కిక్కిచ్చే ఫోటో ఒకటి నెట్టింట వైరలవుతుంది. అందులో తన అన్నయ్య ఎన్టీఆర్ ను మోక్షజ్ఞ ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు. అదే సమయంలో మోక్షజ్ఞ మనస్పూర్తిగా నవ్వుతూ కనిపించారు. ఈ ఫోటోను మోక్షజ్ఞ తన ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ వెలకట్టలేని క్షణం అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఎన్నాళ్లకెన్నాళ్లకు నందమూరి అన్నదమ్ములు ఇలా కలిసి కనిపించారంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక మోక్షజ్ఞ, తారక్ కలిసి ఉన్న ఈ ఫోటోకు ఇతర హీరోల ఫ్యాన్స్ సైతం పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.