Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు షాక్.. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. కారణమిదే

|

Sep 22, 2024 | 9:17 PM

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం దేవర. కొరటాల శివ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా, అలాగే సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న దేవర ఈ నెల సెప్టెంబర్27న ప్రేక్షకుల ముందుకు రానుంది

Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు షాక్.. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. కారణమిదే
Devara Move
Follow us on

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం దేవర. కొరటాల శివ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా, అలాగే సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న దేవర ఈ నెల సెప్టెంబర్27న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మం చేశారు మేకర్స్. ఇప్పటికే ముంబై, చెన్నై తో పాటు పలు నగరాల్లో దేవర టీమ్ పర్యటించింది. అలాగే సందీప్ రెడ్డి వంగా, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ వంటి స్టార్స్ తో ఇంటర్వ్యూలు కూడా నిర్వహంచారు. తాజాగా ప్రమోషన్లలో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 22) దేవర ప్రీరిలీజ్‌ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఇందుకోసం హైదరాబాద్‌ హైటెక్స్‌లోని నోవాటెల్‌లో ఘనంగా ఏర్పాట్లు చేశారు. అయితే అక్కడ కేవలం 5వేల మందికి మాత్రమే ఎంట్రీ ఉంది. కానీ పరిమితికి మించి అభిమానులు రావడంతో వేదిక ప్రాంగణంలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సుమారు 15 వేలకు మంది పైగానే అభిమానులు చొచ్చుకుని వచ్చారు. పోలీసులు నిలువరించినా ఫలితం లేకపోయింది. దీంతో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ఆర్గనైజర్స్.

దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా దేవర సినిమాను నిర్మించాయి. అనిరుధ్ రవిచందర్ అందించిన స్వరాలు ఇప్పటికే సంగీత ప్రియులను అలరిస్తున్నాయి.ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తోన్నచిత్రం కావడంతో దేవరపై అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకు రిలీజైన పాటలు, పోస్టర్లు, టీజర్స, ట్రైలర్లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

ఇవి కూడా చదవండి

నొవాటెల్ ప్రాంగణంలో పోలీసులు.. వీడియో

సుమారు 15 వేలకు పైగా మంది రావడంతో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.