NTR: అతడి నుంచి ఆ మేసేజ్ వస్తే ఎన్టీఆర్‏కు తెగ చిరాకు వస్తుందట.. నవంబర్ అంటే తారక్‏కు అంత భయమా..

|

Nov 22, 2022 | 7:57 PM

ఓ మెసేజ్ వస్తే తారక్ కు తెగ చిరాకు వస్తుందట. ఆ కారణంగానే తనకు నవంబర్ నెల అంటేనే భయం అంటూ చెప్పుకొచ్చారు. ఇంతకీ అసలు రాజీవ్ ఏం మెసేజ్ చేసేవారు.. ఎందుకు తారక్ కు నచ్చదు అనే విషయం తెలుసుకుందామా.

NTR: అతడి నుంచి ఆ మేసేజ్ వస్తే ఎన్టీఆర్‏కు తెగ చిరాకు వస్తుందట.. నవంబర్ అంటే తారక్‏కు అంత భయమా..
Ntr Jr.
Follow us on

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సినీ పరిశ్రమలో అతి తక్కువ మంది ప్రాణ స్నేహితులున్నారు. కెరీర్ ప్రారంభం నుంచే తారక్‏కు ఉన్న అత్యంత సన్నిహితులలో రాజీవ్ కనకాల ఒకరు. వీరిద్దరు ఎంతో స్నేహంగా ఉండేవారు. చిన్న గొడవతో మొదలైన వీరి పరిచయం స్నేహంగా మారిపోయింది. గతంలో తారక్ నటించిన ప్రతి సినిమాలో రాజీవ్ కనకాల ఉండేవారు. తాజాగా వీరిద్దరి స్నేహానికి సంబంధించిన ఓ ఓల్డ్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. రాజీవ్ కనకాల నుంచి ఓ మెసేజ్ వస్తే తారక్ కు తెగ చిరాకు వస్తుందట. ఆ కారణంగానే తనకు నవంబర్ నెల అంటేనే భయం అంటూ చెప్పుకొచ్చారు. ఇంతకీ అసలు రాజీవ్ ఏం మెసేజ్ చేసేవారు.. ఎందుకు తారక్ కు నచ్చదు అనే విషయం తెలుసుకుందామా.

ఓ సినిమా ప్రమోషన్లలలో భాగంగా .. ఎన్టీఆర్ మాట్లాడుతూ. రాజీవ్ కనకాల గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. ప్రతి సంవత్సరం చిల్ట్రన్స్ డే వస్తే..తనకు రాజీవ్ హ్యాప్పీ చిల్డ్రన్స్ డే అని మెసేజ్ చేస్తాడని.. ఆ మెసేజ్ రావడం తనకు చిరాకు వస్తుందన్నారు. అంతేకాదు..రాజీవ్ ఫోన్లో తారక్ పేరు కిడ్ (చిన్న పిల్లవాడు) అని సేవ్ చేసుకున్నాడని అన్నారు. ప్రస్తుతం తనకు ఇద్దరు పిల్లలు ఉన్నా కానీ.. రాజీవ్ కనకాల మాత్రం ఇప్పటికీ హ్యా్ప్పీ చిల్డ్రన్స్ డే అని మెసేజ్ పంపిస్తారని అన్నారు. ఇందుకు సంబంధించివ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ప్రస్తుతం తారక్.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. అలాగే.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ కాంబోలో ఓ మూవీ రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.