NTR31: యంగ్ టైగర్ బర్త్ డే స్పెషల్.. NTR 31 అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..

|

May 20, 2023 | 3:00 PM

తారక్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ తర్వాత తారక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇక ఈరోజు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు మేకర్స్.

NTR31: యంగ్ టైగర్ బర్త్ డే స్పెషల్.. NTR 31 అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..
Ntr31
Follow us on

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మే 19న విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇందులో తారక్ ఊరమాస్ లుక్‏లో కనిపించబోతున్నారు. తారక్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ తర్వాత తారక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇక ఈరోజు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు మేకర్స్.

కేజీఎఫ్ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ చేయబోయే సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ క్రమంలో తాజాగా తారక్ బర్త్ డే విషెస్ తెలియజేస్తూ.. ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ రెగ్యూలర్ షూటింగ్ వచ్చే ఏడాది నుంచి స్టార్ట్ కాబోతుందని తెలియజేశారు. మొత్తానికి బ్యాక్ టూ బ్యాక్ అప్డేట్స్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమానే కాకుండా.. ఈసారి బాలీవుడ్ ఇండస్ట్రీలో నేరుగా ఓ మూవీ చేయబోతున్నారు తారక్. అదే వార్ 2. ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి మెయిన్ రోల్ చేయనున్నారు. ఇక ఇటీవల ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో తారక్ రోల్ ఫుల్ నెగిటివ్ షెడ్స్ లో ఉంటుందని.. మరోసారి పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారట.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.