Padma Vibushan Chiranjeevi : అప్పుడూ.. ఇప్పుడూ.. చిరంజీవి అంటే కోట్లాది అభిమానుల గుండెచప్పుడు..

150కి పైగా సినిమాలు.. పదుల సంఖ్యలో అవార్డులు.. వందలాది రివార్డులు.. వేలల్లో చార్ట్‌బస్టర్లు.. కోట్లాది అభిమానులు.. ఇదీ మెగాస్టార్‌ ట్రాక్‌రికార్డ్‌.  ఖైదీ, చాలెంజ్‌, అభిలాష, చంటబ్బాయి, రుద్రవీణ, స్వయం కృషి, కొదమసింహం, గ్యాంగ్‌లీడర్‌, ఘరానామొగుడు, ముఠామేస్త్రీ, జగదేకవీరుడు అతిలోక సుందరి, హిట్లర్‌, చూడాలనివుంది, అన్నయ్య, ఇంద్ర, టాగూర్‌, శంకర్‌దాదా ఎంబీబీఎస్‌, ఖైదీనెంబర్‌ 150, వాల్తేరు వీరయ్య లాంటి ఇండస్ట్రీ హిట్స్‌ ఎన్నో రికార్డులను సృష్టించాయి.

Padma Vibushan Chiranjeevi : అప్పుడూ.. ఇప్పుడూ.. చిరంజీవి అంటే కోట్లాది అభిమానుల గుండెచప్పుడు..
Chiranjeevi
Follow us

|

Updated on: Jan 26, 2024 | 12:32 PM

ఒక బౌండరీ అంటూ లేని సినీరంగంలో.. ఒక్కడై వచ్చి.. కొండంతగా ఎదిగి.. తనతోపాటు.. పదిమందిని పైకి తీసుకొచ్చి… స్టారాది స్టారుడుగా.. గ్రేటాది గ్రేటుగా మారారు చిరంజీవి. 150కి పైగా సినిమాలు.. పదుల సంఖ్యలో అవార్డులు.. వందలాది రివార్డులు.. వేలల్లో చార్ట్‌బస్టర్లు.. కోట్లాది అభిమానులు.. ఇదీ మెగాస్టార్‌ ట్రాక్‌రికార్డ్‌.  ఖైదీ, చాలెంజ్‌, అభిలాష, చంటబ్బాయి, రుద్రవీణ, స్వయం కృషి, కొదమసింహం, గ్యాంగ్‌లీడర్‌, ఘరానామొగుడు, ముఠామేస్త్రీ, జగదేకవీరుడు అతిలోక సుందరి, హిట్లర్‌, చూడాలనివుంది, అన్నయ్య, ఇంద్ర, టాగూర్‌, శంకర్‌దాదా ఎంబీబీఎస్‌, ఖైదీనెంబర్‌ 150, వాల్తేరు వీరయ్య లాంటి ఇండస్ట్రీ హిట్స్‌ ఎన్నో రికార్డులను సృష్టించాయి. తెలుగులో తొలి పదికోట్ల రూపాయల వసూళ్లు రాబట్టిన హీరో చిరంజీవి, తొలి 50కోట్లు కూడా మెగాస్టారే. తొలి వంద కోట్ల సినిమాలోనూ చిరంజీవి నటించారు. చిరంజీవి సినిమా అంటే.. నైజాం రైట్స్‌ కోసం బయ్యర్లు ఎగబడే వారు.. సీమలో థియేటర్లు దద్దరిల్లేవి.. ఉత్తరాంధ్రలో పిచ్చిపట్టనట్లు చూసేవారు.. ఇక గోదావరి జిల్లాల అభిమానుల గురించి చెప్పనక్కర్లేదు. విజయవాడలో ఆయన సినిమాలు ఏడాదిపాటు ఆడేవంటే ఆ క్రేజ్‌ ఏ రేంజో అర్ధం చేసుకోవచ్చు.

సాధారణంగా టాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో కామెడీ ఉంటుంది.. కొన్ని సినిమాల్లో యాక్షన్‌ ఉంటుంది.. ఇంకొన్ని సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ కోసం ఎమోషన్‌, సెంటిమెంట్‌ పెట్టి తీస్తారు. కాని ఇవన్నీ కలిపి ఉండేది కేవలం చిరంజీవి సినిమాలోనే. అంతేకాదు.. మెగాస్టార్‌ డ్యాన్సులు ప్రత్యేకం. ఇప్పటికీ ఆయన గ్రేస్‌ని మ్యాచ్‌ చేయడానికి చాలామంది హీరోలు ప్రయత్నాలు చేస్తుంటారు. కళ్లతోనే ఏ ఎమోషన్‌ని అయినా పండించగల మహానటుడు చిరంజీవి. 68 ఏళ్ల వయసులోనూ ఆయన ఉత్సాహంగా సినిమాలు తూస్తూ.. ఉల్లాసంగా డ్యాన్సులు, ఫైట్లు చేస్తున్నారంటే ఆయన ఎంచుకున్న రంగంపై ఎంత ప్రేమ ఉండాలి. తన సినిమాతోపాటు.. మొత్తం ఇండస్ట్రీ బతకాలన్న సంకల్పంతో.. తన దగ్గరకి వచ్చే నటులు, దర్శకులను ఎంకరేజ్‌ చేస్తూ.. వారి సినిమా ఓపెన్సింగ్స్‌కి, ప్రీ రిలీజ్‌ ఫంక్షన్లకు వెళ్తూ ఉత్సాహపరుస్తుంటారు. తెలుగు ఇండస్ట్రీకి పెద్దగా ఆయన పాత్రపోషిస్తున్నారు.

చిరంజీవి అంటే కేవలం సినిమాలేకాదు.. గొప్ప సామాజికవేత్త కూడా. దేశంలో ఎంతోమంది చిన్నారులు, యువత, వృద్ధులు సమయానికి రక్తం అందక చనిపోతున్నారన్న సర్వేలతో ప్రభావితం అయిన మెగాస్టార్‌ చిరంజీవి తన బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా ప్రతీ ఏటా వేలాది మందికి రక్తం అందిస్తున్నారు. బతికిస్తున్నారు. అంతేకాదు కరోనా సమయంలో ఆయన ఎంత సేవచేరాశో అంతా చూశారు. చిరంజీవి కరోనా క్రైసిస్‌ చారిటీ అంటూ.. CCCని స్థాపించి దాని ద్వారా సినిమా ఇండస్ట్రీలోని పేదలకు సేవలు అందించారు. ప్రతీరోజు ఆహారం, ప్రతీ నెలా సరుకులు… వైద్యసాయం కావాల్సివారికి తన చారిటీ ద్వారా దగ్గరుండి చూసుకున్నారు. అంతేకాదు.. కరోనాలో ఆక్సిజన్‌ కరువైన సమయంలోనూ తన ట్రస్టు ద్వారా పంపిణీ చేశారు. ఇక చిత్రపురి కాలనీకి శ్రీకారం చుట్టడం వారికి ఇళ్ల స్థలాలు ఇప్పించడమేకాదు.. ఇళ్లు కట్టించేవరకు ప్రభుత్వంతో పోరాడారు. మరోవైపు రాజకీయాల్లో ఉన్న సమయంలో కేంద్రమంత్రిగా ఎన్నో సేవలు అందించారు. ఇండస్ట్రీలో టికెట్ల విషయంలో సమస్య వచ్చినపుడు ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరించడానికి చొరవచూపించారు మెగాస్టారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సమయంలో మేను సైతం వంటి కార్యక్రమాల ద్వారా డబ్బును కూడబెట్టి ప్రభుత్వాలకు అందించారు. ఇలా మెగాస్టార్‌ జీవితం అటు సినిమాలకు ఇటు సామాజిక కార్యక్రమాలకే అంకితం చేశారు. దీంతో కేంద్రం ఆయన సేవలు గుర్తించి పద్మవిభూషణ్‌ అవార్డును ప్రకటించింది. త్వరలోనే రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డును అందుకోబోతున్నారు చిరంజీవి. చిరంజీవి అంటే కోట్లాది అభిమానుల గుండెచప్పుడు. ఇండస్ట్రీకి పెద్దన్నయ్య. ప్రభుత్వాలకు కావాల్సివాడు.. సింపుల్‌గా చెప్పాలంటే అందరివాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Pakistan: పాకిస్థాన్ హెడ్ కోచ్ పదవికి గ్యారీ కిర్‌స్టెన్ రాజీనామా
Pakistan: పాకిస్థాన్ హెడ్ కోచ్ పదవికి గ్యారీ కిర్‌స్టెన్ రాజీనామా
మీకు ఆస్తమా సమస్య ఉందా.. చలికాలం వచ్చేసింది జాగ్రత్త!
మీకు ఆస్తమా సమస్య ఉందా.. చలికాలం వచ్చేసింది జాగ్రత్త!
రోడ్డు పక్కన నోట్లు..ఎగబడి తీసుకున్న జనం..ఆ తర్వాత
రోడ్డు పక్కన నోట్లు..ఎగబడి తీసుకున్న జనం..ఆ తర్వాత
అవినాశ్‌కు డాక్టర్ చెకప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు.. ఏమైందంటే?
అవినాశ్‌కు డాక్టర్ చెకప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు.. ఏమైందంటే?
దీపావళికి జిగేల్‌మనే ఆఫర్‌.. రూ. 699కే 4జీ ఫోన్‌..
దీపావళికి జిగేల్‌మనే ఆఫర్‌.. రూ. 699కే 4జీ ఫోన్‌..
3 మ్యాచ్‌లాడి టీమిండియా నుంచి తప్పుకున్న ఐపీఎల్ స్పీడ్‌స్టర్
3 మ్యాచ్‌లాడి టీమిండియా నుంచి తప్పుకున్న ఐపీఎల్ స్పీడ్‌స్టర్
ఈ చిన్న టిప్స్‌తో. . మీ జుట్టు పొడుగ్గా, ఒత్తుగా మారుతుంది..
ఈ చిన్న టిప్స్‌తో. . మీ జుట్టు పొడుగ్గా, ఒత్తుగా మారుతుంది..
విద్యార్థులకు శుభవార్త.. దీపావళి పండగకు 4 రోజులు స్కూళ్లు బంద్‌!
విద్యార్థులకు శుభవార్త.. దీపావళి పండగకు 4 రోజులు స్కూళ్లు బంద్‌!
హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఏంటంటే?
హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఏంటంటే?
స్మార్ట్‌ఫోన్‌లో 'డిజిటల్‌ కండోమ్‌'.. ఎలా పని చేస్తుందో తెలుసా.?
స్మార్ట్‌ఫోన్‌లో 'డిజిటల్‌ కండోమ్‌'.. ఎలా పని చేస్తుందో తెలుసా.?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!