Shekar: ‘శేఖర్’ మూవీ వివాదంలో జీవితా రాజశేఖర్ గెలుపు.. న్యాయస్థానం ఏమన్నదంటే

రాజశేఖర్ కథానాయకుడిగా లేటెస్ట్ మూవీ శేఖర్. రాజశేఖర్ కెరీర్ లో 91వ సినిమాగా ఈ మూవీ వచ్చింది. ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్(Jeevitha Rajsekhar) దర్శకత్వం.

Shekar: శేఖర్ మూవీ వివాదంలో జీవితా రాజశేఖర్ గెలుపు.. న్యాయస్థానం ఏమన్నదంటే
Jeevitha Rajasekhar

Updated on: May 23, 2022 | 8:11 PM

రాజశేఖర్ కథానాయకుడిగా లేటెస్ట్ మూవీ శేఖర్(Shekar). రాజశేఖర్ కెరీర్ లో 91వ సినిమాగా ఈ మూవీ వచ్చింది. ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్(Jeevitha Rajsekhar) దర్శకత్వం. స్క్రీన్ ప్లే కూడా అందించారు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీకార్ప్, టారస్ సినీకార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించారు. శేఖర్ సినిమా గత శుక్రవారం విడుదలైంది. అయితే, ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వేసిన కేసు కారణంగా సినిమా ప్రదర్శన నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో జీవితా రాజశేఖర్, శేఖర్ చిత్రబృందం సభ్యులకు అనుకూలంగా కోర్టులో న్యాయమూర్తి మాట్లాడినట్టు తెలుస్తోంది.

‘శేఖర్’ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తామెప్పుడూ చెప్పలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా సినిమా ప్రదర్శనకు ఆటంకం కలిగించారు. అయితే, కోర్టు సినిమా ప్రదర్శనకు ఎటువంటి అభ్యంతరం తెలపలేదు. శేఖర్ సినిమాను నిరభ్యంతరంగా ప్రదర్శించవచ్చు. జీవితా రాజశేఖర్, నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి తరపు న్యాయవాదులు మంగళవారం విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

ఇవి కూడా చదవండి

Major Movie: మేజర్ టీం అనుహ్య నిర్ణయం.. విడుదలకు ముందే ప్రీమియర్స్ షోస్..

Viral Photo: ముసుగు చాటున అందమైన వెన్నెలమ్మ.. ఆ కళ్లు చెప్పే మాటలకు అర్థాలేన్నో..! ఆమె ఎవరో తెలుసా ?..

Khushi Movie: సమంత.. విజయ్ దేవరకొండకు డైరెక్టర్ థ్యాంక్స్.. ఖుషి సినిమా నుంచి ఆసక్తికర అప్టేట్..