Game Changer: జరగండి జరగండి.. గేమ్ ఛేంజర్ సాంగ్ వచ్చేసింది.. అదిరిపోయిందిగా..

ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మొదటిసారి రాజకీయన నాయకుడిగా కనిపించనున్నారు చరణ్. అలాగే ఐఏఎస్ పాత్రలోనూ నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చాలా కాలం క్రితమే స్టార్ట్ అయినా.. కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ గ్లింప్స్ మాత్రమే రిలీజ్ అయ్యింది. ఇన్నాళ్లకు మళ్లీ ఇప్పుడు చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి జరగండి జరగండి జరగండి సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. బుధవారం ఉదయం జరగండి ఫుల్ సాంగ్ విడుదల చేశారు.

Game Changer: జరగండి జరగండి.. గేమ్ ఛేంజర్ సాంగ్ వచ్చేసింది.. అదిరిపోయిందిగా..
Jaragandi Song

Updated on: Mar 27, 2024 | 1:44 PM

పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో శ్రీకాంత్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మొదటిసారి రాజకీయన నాయకుడిగా కనిపించనున్నారు చరణ్. అలాగే ఐఏఎస్ పాత్రలోనూ నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చాలా కాలం క్రితమే స్టార్ట్ అయినా.. కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ గ్లింప్స్ మాత్రమే రిలీజ్ అయ్యింది. ఇన్నాళ్లకు మళ్లీ ఇప్పుడు చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి జరగండి జరగండి జరగండి సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. బుధవారం ఉదయం జరగండి ఫుల్ సాంగ్ విడుదల చేశారు.

“జరగండి జరగండి జరగండి.. జాబిలమ్మ జాకెట్టేసుకోని వచ్చేసేనండి..” అంటూ సాగే మాస్ సాంగ్ ఆకట్టుకుంటుంది. మరోసారి థమన్ అందించిన మాస్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. అలాగే అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. డాలర్ మెహెన్ది, సునిధి చౌహన్ ఆలపించారు. ప్రభుదేవ కొరియోగ్రాఫీ అందించారు. చరణ్, కియారా స్క్రీన్ ప్రెజెన్స్ అదుర్స్ అనిపిస్తుంది. ఇక శంకర్ స్టాండర్డ్ విజన్ లో ఈ సాంగ్ ని గ్రాండ్ గా రూపొందించారు. అలాగే ఇందులో చరణ్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి.

ఈ సినిమనే కాకుండా.. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలోనూ చరణ్ ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. గేమ్ ఛేంజర్ షూటింగ్ కంప్లీట్ కాగానే.. ఆర్సీ 16 రెగ్యూలర్ షూట్ స్టార్ట్ కానుందని టాక్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.