AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anupama Parameswaran: అందరి ముందు అలాంటి సీన్స్ చేయడం కష్టమే.. అనుపమ కామెంట్స్..

ఇందులో అనుపమ ఫుట్ రొమాంటిక్.. గ్లామరస్ బ్యూటీగా కనిపించడంతో అభిమానులు కాస్త హర్ట్ అయ్యారు. తమ అభిమాన హీరోయిన్ ఇలా నటించడమేంటనీ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తనకు ఒకేలాంటి రోల్స్ కాకుండా కాస్త ఢిఫరెంట్ రోల్స్ చేయాలని ఉందంటూ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది అనుపమ. తాజాగా అందరి ముందు రొమాన్స్ చేయడం చాలా కష్టమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనుపమ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

Anupama Parameswaran: అందరి ముందు అలాంటి సీన్స్ చేయడం కష్టమే.. అనుపమ కామెంట్స్..
Anupama
Rajitha Chanti
|

Updated on: Mar 27, 2024 | 9:20 AM

Share

అనుపమ పరమేశ్వరన్.. దక్షిణాది చిత్రపరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. దాదాపు పదేళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ గుండెలను మాత్రం ముక్కలు చేసింది. ఇన్నాళ్లు ట్రెడిషనల్ బ్యూటిగా కనిపించిన ఈ మలయాళీ కుట్టి.. ఇప్పుడు గ్లామర్స్ హద్దులు చేరిపేసింది. యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ సరసన టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఇందులో అనుపమ ఫుట్ రొమాంటిక్.. గ్లామరస్ బ్యూటీగా కనిపించడంతో అభిమానులు కాస్త హర్ట్ అయ్యారు. తమ అభిమాన హీరోయిన్ ఇలా నటించడమేంటనీ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తనకు ఒకేలాంటి రోల్స్ కాకుండా కాస్త ఢిఫరెంట్ రోల్స్ చేయాలని ఉందంటూ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది అనుపమ. తాజాగా అందరి ముందు రొమాన్స్ చేయడం చాలా కష్టమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనుపమ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

“కారులో రొమాంటిక్ సీన్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు.. కానీ రొమాంటిక్ సీన్ చేయడం అంత ఈజీ కాదు. ఇద్దరు సన్నిహితంగా ఉండే ఒక ప్రైవేట్ క్షణం. కానీ షూట్ కోసం 100 మంది ముందు చేయాల్సి ఉంటుంది. కారులో రొమాంటిక్ సీన్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. రెండు వైపులా కాలికి గాయాలయ్యాయి. అయినా నటించాలి. రొమాన్స్ ఈజీగా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. కానీ, అది అంత ఈజీ కాదు” అని చెప్పుకొచ్చింది అనుపమ.

మలయాళంలో ‘ప్రేమమ్’ సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తర్వాత శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణారున యుద్ధం, తేజ్ ఐ లవ్ యూ, హలో గురు ప్రేమ కోసమే, కార్తీకేయ 2, రౌడీ బాయ్స్, 18 పేజేస్ వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం టిల్లు స్వ్కే్ర్ చిత్రంలో నటించింది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను మార్చి 29న రిలీజ్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us