AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prashanthi Harathi: పెళ్లాం ఊరెళితే సినిమాలో సునీల్ భార్య గుర్తుందా ? .. 20 ఏళ్ల తర్వాత మీడియా ముందుకు..

అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాలోనూ ముస్లీం అమ్మాయిగా కనిపించింది. అలాగే ఫిబ్రవరి 14 నెక్లెస్ రోడ్, రూపాయి వంటి సినిమాల్లోనూ కనిపించింది. కానీ పెళ్లాం ఊరెళితే సినిమాతో మాత్రమే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. శ్రీకాంత్, సంగీత, వేణు, సునీల్, రక్షిత, ప్రశాంతి హారతి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా 2003లో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. అప్పట్లో ఈ మూవీ దాదాపు 100 రోజులకు పైగా ఆడింది. ఈ సినిమాలో నటనకుగానూ చిరంజీవి చేతుల మీదుగా షీల్డ్ అందుకుంది.

Prashanthi Harathi: పెళ్లాం ఊరెళితే సినిమాలో సునీల్ భార్య గుర్తుందా ? .. 20 ఏళ్ల తర్వాత మీడియా ముందుకు..
Prashanthi Harathi
Rajitha Chanti
|

Updated on: Mar 27, 2024 | 10:40 AM

Share

సినీ పరిశ్రమలో హీరోహీరోయిన్స్ మాత్రమే కాదు.. సహాయ పాత్రలు కూడా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండిపోతాయి. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించి తమ నటనతో గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో ప్రశాంతి హారతి ఒకరు. ఈ పేరు చెబితే అసలే గుర్తుపట్టలేరు.. కానీ పెళ్లాం ఊరెళితే సినిమాలో సునీల్ పాత్రకు భార్య అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ మూవీలో భర్తను గుడ్డిగా నమ్మే అమాయకపు భార్య పాత్రలో తన నటనతో అదరగొట్టింది. అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాలోనూ ముస్లీం అమ్మాయిగా కనిపించింది. అలాగే ఫిబ్రవరి 14 నెక్లెస్ రోడ్, రూపాయి వంటి సినిమాల్లోనూ కనిపించింది. కానీ పెళ్లాం ఊరెళితే సినిమాతో మాత్రమే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. శ్రీకాంత్, సంగీత, వేణు, సునీల్, రక్షిత, ప్రశాంతి హారతి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా 2003లో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. అప్పట్లో ఈ మూవీ దాదాపు 100 రోజులకు పైగా ఆడింది. ఈ సినిమాలో నటనకుగానూ చిరంజీవి చేతుల మీదుగా షీల్డ్ అందుకుంది.

పెళ్లాం ఊరెళితే సినిమా తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. కానీ అప్పటికే ఇంట్లోవాళ్లు పెళ్లి చేయడంతో భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయ్యింది. నటిగానే కాకుండా కూచిపూడి డ్యాన్సర్ కూడా. అందులో మాస్టర్స్ కూడా చేసింది. క్లాసికల్ డ్యాన్స్ ఫోటోషూట్స్, ప్రదర్శనలు ఇస్తున్న సమయంలోనే ఆమెకు సినిమాలు అవకాశాలు వచ్చాయి. పెళ్లి తర్వాత అమెరికాలో సెటిల్ అయినా ప్రశాంతి.. అక్కడే డ్యాన్స్ అకాడమీ స్టార్ట్ చేసి.. అక్కడి చిన్నారులకు ఇండియన్ కల్చర్, కూచిపూడి డ్యాన్స్ నేర్పిస్తుంది. ఇన్నాళ్లుగా అమెరికాలో ఉన్న ఆమె.. తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇటీవల ఓ యూట్యూబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంతి మాట్లాడుతూ.. అమెరికా వెళ్లిపోయినా తన మనసు సినిమాలపైనే ఉండేదని.. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లు అయ్యారని.. అందరి లైఫ్ సెటిల్ అయ్యిందని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు తనకు సినిమాల్లోకి రావాలని ఉందని తెలిపింది. సినిమాలు, సీరియల్స్, ఓటీటీ, యూట్యూబ్ ఇలా ఏ ఛాన్స్ వచ్చినా నటించేందుకు రెడీగా ఉన్నానని తెలిపింది. ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు చేయాలని ఉందని.. ఇకపై హైదరాబాద్ లో ఉండిపోతానని చెప్పుకొచ్చింది. అలాగే తన కూతురు తాన్య కూచిపూడి డ్యాన్సర్ అని.. వీఎన్ ఆదిత్య తెరకెక్కించిన తెలుగింటి సంస్కృతి అనే మ్యూజిక్ వీడియోలో నటించింని తెలిపింది.

తాను ముందుగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాలో ముస్లీం అమ్మాయిగా నటించనానని.. అదే సమయంలో తనను పెళ్లాం ఊరిళితే అవకాశం వచ్చిందని అన్నారు. ఆ సినిమా తర్వాత ఆఫర్స్ చాలా వచ్చాయని.. కానీ ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదని అన్నారు. ఆ తర్వాత పెళ్లి కావడంతో అమెరికాలో సెటిల్ అయ్యాయని తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us