AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepa Thomas: తొలిసారి అలాంటి మాటలు విన్నాను.. స్టేజ్‌పైనే ఏడ్చేసిన రావు బహదూర్ హీరోయిన్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన హీరోల్లో సత్యదేవ్ కూడా ఒకరు. కెరీర్ ప్రారంభంలో చాలా హీరోల్లో సైడ్ యాక్టర్ గా చేసిన సత్యదేవ్ ఆ తర్వాత హీరోగా మారిపోయాడు. ‘జ్యోతిలక్ష్మి’, ‘బ్లఫ్ మాస్టర్’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ తదితర సినిమాలతో వర్సటైల్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Deepa Thomas: తొలిసారి అలాంటి మాటలు విన్నాను.. స్టేజ్‌పైనే ఏడ్చేసిన రావు బహదూర్ హీరోయిన్
Deepa Thomas
Rajeev Rayala
|

Updated on: Jul 05, 2026 | 12:21 PM

Share

వర్సటైల్ యాక్టర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సత్యదేవ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించిన సత్యదేవ్ ఆతర్వాత హీరోగా మారి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రావు బహుదూర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’. కేరాఫ్ కంచరపాలెం సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఏ,ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి అండ్ శరత్ చంద్ర నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, పాటలు, టీజర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. ‘రావు బహదూర్’ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

థియేటర్స్ లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమ పాజిటివ్  టాక్ తెచ్చుకోవడంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రావు బహుదుర్ సినిమాలో సత్యదేవ్ తన నటనతో ప్రేక్షకులను వ్ విశేషంగా ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో దీపా థామస్ హీరోయిన్ గా నటించింది. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో తొలి సినిమా అయినప్పటికీ తన నటనతో అలరించింది దీపా థామస్.

తాజాగా రావు బహదూర్ మూవీ టీమ్ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ లో హీరోయిన్ దీపా థామస్. మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది.  9 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. కానీ ఈ సినిమా అవకాశం రావడంతో కల నిజమైంది. ఈ సినిమా ఛాన్స్ రావడం నిజంగా నా అదృష్టం. ఈ సినిమాలో సత్యదేవ్ లాంటి బ్రిలియంట్ యాక్టర్ తో కలిసి నటించా.. ఇక రెండేళ్లు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. రీసెంట్ గా ఆడియన్స్ తో థియేటర్లో మూవీ చూశా. వాళ్లు సినిమా చూస్తూ నవ్వుతున్నారు, ఏడుస్తున్నారు. సినిమాలో అన్ని ఎమోషన్స్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యాయి. మూవీ ఎమోషన్స్ తో పాటు ఆడియన్స్ క్యారీ అవుతున్నారు అని దీపా థామస్ చెప్తూ ఒక్కసారిగా ఎమోషనల్ అయింది. స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకుంది. నా పేరేంట్స్‌కు తెలుగు రాదు. వాళ్లు ఈ సినిమాని సబ్‌టైటిల్స్‌తో చూశారు. ఈ సినిమా చూసి మా నాన్న ఇంకా బాగా చేయాలని తొలిసారి నాన్న నాతో అన్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us