AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కెమికల్స్ వద్దు.. నేరేడు గింజలతో ఇంట్లోనే చేసుకోండి బ్యూటిఫుల్ బర్గుండి హెయిర్ కలర్!

ప్రస్తుత కాలంలో స్టైలిష్‌గా కనిపించడానికి జుట్టుకు రంగులు (Hair Coloring) వేసుకోవడం ఒక ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా బర్గుండి (గాఢమైన ముదురు ఎరుపు, ఊదా, మరియు గోధుమ రంగుల సమ్మేళనం ఈ బుర్గుండి) (Burgundy) కలర్‌కు యువతలో మంచి క్రేజ్ ఉంది. అయితే, మార్కెట్లో దొరికే రసాయన హెయిర్ డైలు (Chemical Hair Dyes) వాడటం వల్ల జుట్టు పొడిబారడం, విరిగిపోవడం, త్వరగా తెల్లబడటం వంటి సమస్యలు వస్తాయి. మరి వీటికి దూరంగా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే నేరేడు గింజల సహాయంతో బ్యూటిఫుల్ బర్గుండి కలర్‌ను ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కెమికల్స్ వద్దు.. నేరేడు గింజలతో ఇంట్లోనే చేసుకోండి బ్యూటిఫుల్ బర్గుండి హెయిర్ కలర్!
Jamun Seed Hair
Jyothi Gadda
|

Updated on: Jul 05, 2026 | 1:21 PM

Share

ఇవి నేరేడు (జామూన్) పండ్లు దొరికే రోజులు. ఈ ఊదా రంగు పండును చూడగానే, వెంటనే తినాలనిపిస్తుంది. జామూన్ ప్రత్యేకత ఏమిటంటే, మామిడి పండు తిన్న తర్వాత శరీరంలో పెరిగిన చక్కెర, కొవ్వు లేదా కేలరీలను తగ్గించడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని అంటారు. ఈ పోషకమైన పండు సంవత్సరంలో ఒకటి నుండి ఒకటిన్నర నెలలు మాత్రమే మనకు లభిస్తుంది. అందువల్ల, ఇది దొరికినప్పుడల్లా మనం దీనిని పూర్తిగా తినాలి. నేరేడు పండ్ల వల్ల కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే, దాని గింజలు జుట్టుకు మంచి రంగును ఇస్తాయి. దానిని ఎలా తయారు చేయాలో, జుట్టుకు ఎలా అప్లై చేయాలో చూద్దాం…

నేరేడు గింజల ప్రత్యేకత:

నేరేడు పండ్లలో, వాటి గింజలలో ముదురు రంగును ఇచ్చే సహజసిద్ధమైన పిగ్మెంట్స్ (Natural Pigments), యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు రంగును ఇవ్వడమే కాకుండా కుదుళ్లకు మంచి పోషణను అందిస్తాయి.

ఇవి కూడా చదవండి

కావలసిన పదార్థాలు:

ఎండబెట్టి పొడి చేసిన నేరేడు గింజల పౌడర్ – 3 నుండి 4 చెంచాలు, గోరువెచ్చని నీరు సరిపడినంత తీసుకోవాలి. మొత్తటి నేరేడు గింజల పొడిలో కావాల్సినన్నీ నీళ్లు పోసుకుని హెయిర్‌ ప్యాక్‌లా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక రాత్రంత మూతపెట్టి పక్కనపెట్టుకోవాలి. ఆ మార్నాడు తలకు పట్టించాలి.

ఈ మిశ్రమాన్ని రాత్రంతా (కనీసం 8 గంటలు) అలాగే నాననివ్వాలి. ఇనుప పాత్రలో నానబెట్టడం వల్ల రంగు మరింత గాఢంగా, ఎక్కువ కాలం నిలిచేలా మారుతుంది. మరుసటి రోజు ఉదయం జుట్టును చిక్కులు లేకుండా దువ్వుకుని, బ్రష్ సహాయంతో ఈ ప్యాక్‌ను కుదుళ్ల నుండి జుట్టు చివర్ల వరకు బాగా పట్టించాలి. ప్యాక్ అప్లై చేసిన తర్వాత 2 గంటల పాటు అలాగే ఉంచాలి. ఆపై ఎలాంటి షాంపూ ఉపయోగించకుండా కేవలం సాధారణ నీటితో మాత్రమే జుట్టును శుభ్రంగా కడుక్కోవాలి.

ముఖ్యమైన చిట్కా: ప్యాక్ కడిగిన రోజు రాత్రి జుట్టుకు బాగా నూనె పట్టించి, మరుసటి రోజు ఉదయం మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల బర్గుండి రంగు జుట్టుకు బాగా పట్టి, ఎక్కువ రోజులు కొత్తగా మెరుస్తుంది. లాభాలు: నేరేడు గింజల ప్యాక్ వల్ల జుట్టుకు అందమైన బర్గుండి రంగు రావడమే కాకుండా చుండ్రు సమస్య తగ్గుతుంది. తెల్ల జుట్టు (Grey Hair) సులభంగా కవర్ అవుతుంది. ఎలాంటి కెమికల్స్ లేని ఈ సహజసిద్ధమైన పద్ధతిని నెలకు రెండుసార్లు ప్రయత్నించి మీ జుట్టును ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా మార్చుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
నేరేడు గింజలతో ఇంట్లోనే చేసుకోండి బ్యూటిఫుల్ బర్గుండి హెయిర్ కలర్
నేరేడు గింజలతో ఇంట్లోనే చేసుకోండి బ్యూటిఫుల్ బర్గుండి హెయిర్ కలర్
కోట శ్రీనివాసరావు ఆహీరో యాక్టింగ్ చూసి ఫిదా అయ్యారు.
కోట శ్రీనివాసరావు ఆహీరో యాక్టింగ్ చూసి ఫిదా అయ్యారు.
హైదరాబాద్‌లో హర్యానా పోలీసుల సీక్రెట్ ఆపరేషన్..
హైదరాబాద్‌లో హర్యానా పోలీసుల సీక్రెట్ ఆపరేషన్..
నాన్‌స్టాప్‌గా గంట సేపు ఈత కొట్టిన మంత్రి! ఎవరో గుర్తుపట్టారా?
నాన్‌స్టాప్‌గా గంట సేపు ఈత కొట్టిన మంత్రి! ఎవరో గుర్తుపట్టారా?
కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు.. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు.. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
ఒకరిద్దరు కాదు.. సర్పంచ్ సాబ్‌కు వెన్నుపోటు పొడిచిన ముగ్గురు
ఒకరిద్దరు కాదు.. సర్పంచ్ సాబ్‌కు వెన్నుపోటు పొడిచిన ముగ్గురు
మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది..
మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది..
మాడిపోయిన గిన్నెలను 5 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే ట్రిక్స్..
మాడిపోయిన గిన్నెలను 5 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే ట్రిక్స్..
బెడ్‌రూమ్‌లో టీవీ ఉంచడం శుభమా అశుభమా? చిన్న పొరపాటుతో పెద్ద సమస్య
బెడ్‌రూమ్‌లో టీవీ ఉంచడం శుభమా అశుభమా? చిన్న పొరపాటుతో పెద్ద సమస్య
ఉదయం అతనికి 57 ఏళ్లు, మధ్యాహ్నానికల్లా 25 ఏళ్ల కుర్రాడు!
ఉదయం అతనికి 57 ఏళ్లు, మధ్యాహ్నానికల్లా 25 ఏళ్ల కుర్రాడు!