AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో హర్యానా పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. కరుడుగట్టిన దొంగను ఎలా పట్టుకున్నారో తెలుసా..?

హైదరాబాద్ చంపాపేటలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎవరికీ అనుమానం రాకుండా సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన హర్యానా పోలీసులు.. లోకల్ పోలీసులతో కలిసి నిర్వహించిన ఒక సీక్రెట్ ఆపరేషన్‌లో కరుడుగట్టిన అంతర్రాష్ట్ర నేరస్థుడు దొరికిపోయాడు. హర్యానాలో భారీ దోపిడీ చేసి ఇన్నాళ్లూ భాగ్యనగరంలో దొరకకుండా తలదాచుకున్న ఆ కిలాడీ దొంగను ఎలా పట్టుకున్నారో తెలుసుకుందాం..

హైదరాబాద్‌లో హర్యానా పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. కరుడుగట్టిన దొంగను ఎలా పట్టుకున్నారో తెలుసా..?
Haryana Criminal Arrested In Hyderabad
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Jul 05, 2026 | 1:19 PM

Share

హర్యానాలో భారీ దోపిడీ కేసులో నిందితుడిగా ఉండి, చాలా కాలంగా పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న ఒక కరుడుగట్టిన నేరస్థుడి ఆట ఎట్టకేలకు హైదరాబాద్‌లో ముగిసింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన హర్యానా స్పెషల్ టీమ్ పోలీసులు.. స్థానిక ఐఎస్ సదన్ పోలీసుల సహకారంతో నగరంలో ఒక మెరుపు ఆపరేషన్ నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హర్యానాలో నమోదైన ఒక కీలక దోపిడీ కేసులో యశ్వంత్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అక్కడ క్రైమ్ చేసిన అనంతరం పోలీసులకు దొరకకుండా తప్పించుకున్న అతడు.. భాగ్యనగరంలో తలదాచుకున్నట్లు హర్యానా పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన హర్యానా పోలీసుల ప్రత్యేక బృందం ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా సైలెంట్‌గా హైదరాబాద్‌కు చేరుకుంది. స్థానిక ఐఎస్ సదన్ పోలీసులను సంప్రదించి, వారి సహాయంతో చంపాపేటలోని దుర్గా భవానీ నగర్ పరిసరాల్లో నిఘా పెట్టింది. నిందితుడి కదలికలను నిరంతరం గమనిస్తూ.. సరైన సమయం చూసి ఒక్కసారిగా మెరుపు దాడి చేసి యశ్వంత్‌ను బంధించారు.

హైదరాబాద్‌ లింకులపై ఆరా..

యశ్వంత్‌పై హర్యానాలో తీవ్రమైన దోపిడీ ఆరోపణలు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే అతడు హైదరాబాద్‌లో ఎంతకాలంగా తలదాచుకుంటున్నాడు? నగరంలో అతనికి ఎవరైనా ఆశ్రయం కల్పించారా? స్థానికంగా ఎవరితోనైనా నేరపూరిత సంబంధాలు ఉన్నాయా? అనే పలు కోణాల్లో పోలీసులు ప్రస్తుతం తీవ్రంగా విచారిస్తున్నారు.

హర్యానాకు తరలింపు.. దర్యాప్తు ముమ్మరం

అరెస్టు ప్రక్రియ పూర్తికాగానే నిందితుడు యశ్వంత్‌ను తదుపరి విచారణ, కోర్టు హాజరు పరచడం కోసం పోలీసులు హర్యానాకు తరలిస్తున్నారు. ఈ దోపిడీ కేసులో యశ్వంత్‌తో పాటు మరికొందరి పాత్ర ఉందా? ఈ గ్యాంగ్‌లో ఇంకా ఎవరైనా పరారీలో ఉన్నారా? అనే అంశాలపై హర్యానా పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున హర్యానా పోలీసులు జరిపిన ఈ సీక్రెట్ ఆపరేషన్ సంచలనంగా మారింది.

Follow Us
హైదరాబాద్‌లో హర్యానా పోలీసుల సీక్రెట్ ఆపరేషన్..
హైదరాబాద్‌లో హర్యానా పోలీసుల సీక్రెట్ ఆపరేషన్..
నాన్‌స్టాప్‌గా గంట సేపు ఈత కొట్టిన మంత్రి! ఎవరో గుర్తుపట్టారా?
నాన్‌స్టాప్‌గా గంట సేపు ఈత కొట్టిన మంత్రి! ఎవరో గుర్తుపట్టారా?
కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు.. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు.. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
ఒకరిద్దరు కాదు.. సర్పంచ్ సాబ్‌కు వెన్నుపోటు పొడిచిన ముగ్గురు
ఒకరిద్దరు కాదు.. సర్పంచ్ సాబ్‌కు వెన్నుపోటు పొడిచిన ముగ్గురు
మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది..
మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది..
మాడిపోయిన గిన్నెలను 5 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే ట్రిక్స్..
మాడిపోయిన గిన్నెలను 5 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే ట్రిక్స్..
బెడ్‌రూమ్‌లో టీవీ ఉంచడం శుభమా అశుభమా? చిన్న పొరపాటుతో పెద్ద సమస్య
బెడ్‌రూమ్‌లో టీవీ ఉంచడం శుభమా అశుభమా? చిన్న పొరపాటుతో పెద్ద సమస్య
ఉదయం అతనికి 57 ఏళ్లు, మధ్యాహ్నానికల్లా 25 ఏళ్ల కుర్రాడు!
ఉదయం అతనికి 57 ఏళ్లు, మధ్యాహ్నానికల్లా 25 ఏళ్ల కుర్రాడు!
ఊరు నుంచి ఆ హీరోకి తలకాయ కూర పంపించా..
ఊరు నుంచి ఆ హీరోకి తలకాయ కూర పంపించా..
వైభవ్ వైఫల్యంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు
వైభవ్ వైఫల్యంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు