AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాడిపోయిన గిన్నెలను 5 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే ట్రిక్స్.. కిచెన్‌లోని వీటితో ఇలా చేస్తే చాలు..

మహిళలకు అత్యంత విసుగు తెప్పించే పని ఏదైనా ఉందీ అంటే.. అది మాడిపోయిన పాత్రలను శుభ్రం చేయడమే. గంటల తరబడి చేతులు నొప్పులు పుట్టేలా రుద్దినా ఆ నల్లటి మొండి మచ్చలు అస్సలు వదలవు. కానీ ఇకపై అంత శ్రమ పడాల్సిన అవసరమే లేదు. మన కిచెన్ లో ఉండే ఈ వస్తువులతో కేవలం 5 నిమిషాల్లో మాడిన పాత్రలను కొత్త వాటిలా ఎలా మెరిపించవచ్చో తెలుసుకుందాం..

మాడిపోయిన గిన్నెలను 5 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే ట్రిక్స్.. కిచెన్‌లోని వీటితో ఇలా చేస్తే చాలు..
How To Clean Burnt Vessels
Krishna S
|

Updated on: Jul 05, 2026 | 12:59 PM

Share

వంట చేసేటప్పుడు కాస్త అటూ ఇటూ చూస్తే చాలు.. పాలు పొంగిపోవడమో లేదా పాయసం, మాంసం గ్రేవీ లాంటివి అడుగున మాడిపోవడమో చాలా సాధారణం. అయితే అలా మాడిపోయిన పాత్రలను శుభ్రం చేయడం మహిళలకు ఒక పెద్ద తలనొప్పి. గంటల తరబడి చేతులు నొప్పులు పుట్టేలా రుద్దినా ఆ నల్లటి మొండి మచ్చలు అస్సలు వదలవు. కానీ ఇకపై ఆ నల్లటి మరకల కోసం అంత శ్రమ పడాల్సిన అవసరం లేదని వంట నిపుణులు చెబుతున్నారు. మన ఇంట్లో ఉండే కొన్ని సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి, కేవలం కొన్ని నిమిషాల్లోనే మాడిన గిన్నెలను కొత్త వాటిలా ఎలా మెరిపించవచ్చో ఇప్పుడు తెలు.

బేకింగ్ సోడా – వెనిగర్ మ్యాజిక్..

డిటర్జెంట్ సబ్బుల కంటే కూడా బేకింగ్ సోడా, వెనిగర్ కాంబినేషన్ మాడిన మరకలను తొలగించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది స్టీల్, అల్యూమినియం పాత్రలకు బెస్ట్ ఆప్షన్. మాడిన గిన్నెలో ఒక కప్పు నీరు, ఒక కప్పు తెల్ల వెనిగర్ పోసి బాగా మరిగించండి. నీరు మరుగుతున్నప్పుడు స్టవ్ ఆపేసి, అందులో రెండు చెంచాల బేకింగ్ సోడా వేయండి. అప్పుడు వచ్చే నురగను అలాగే 15 నిమిషాల పాటు వదిలేయండి. ఆ తర్వాత ఆ నీటిని పారబోసి, నార్మల్ స్క్రబ్బర్‌తో తేలికగా రుద్దితే మాడిన పొర అంతా చర్మంలా ఊడిపోతుంది.

నిమ్మకాయ – ఉప్పు చిట్కా

నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ మొండి మరకలను వదిలించి, పాత్రలకు సహజమైన మెరుపును ఇస్తుంది. మాడిన పాత్రలో నీళ్లు తీసుకుని.. అందులో 2 లేదా 3 నిమ్మకాయ ముక్కలు, రెండు చెంచాల ఉప్పు వేసి 10 నిమిషాల పాటు బాగా మరిగించండి. ఆ వేడికి మాడిన పొర అంతా మెత్తబడుతుంది. ఇప్పుడు ఆ నీటిని పారబోసి, ఉడికిన నిమ్మ తొక్కతోనే ఆ పాత్రను బాగా రుద్ది కడిగితే గిన్నె తళతళలాడుతుంది.

పాత నల్లటి మరకలకు అల్యూమినియం ఫాయిల్

గిన్నెలు మరీ ఎక్కువగా, పాత కాలం నాటి నల్లటి మొండి మరకలతో ఉంటే ఈ పద్ధతి వాడండి. మాడిన ప్రదేశంలో కొద్దిగా బేకింగ్ సోడా, డిష్ వాష్ లిక్విడ్ వేసి, కొద్దిగా గోరువెచ్చని నీటిని పోసి 30 నిమిషాలు నానబెట్టండి. ఇప్పుడు స్క్రబ్బర్‌కు బదులుగా.. మనం ఫుడ్ ప్యాక్ చేయడానికి వాడే అల్యూమినియం ఫాయిల్ పేపర్‌ను చేతితో గుండ్రని బంతిలా చుట్టండి. ఆ ఫాయిల్ బంతితో పాన్‌ను రుద్దితే ఎలాంటి మొండి మచ్చ అయినా మాయమైపోతుంది.

కూల్ డ్రింక్‌తో కూడా క్లీన్ చేయొచ్చు..

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. మనం తాగే థమ్సప్, కోకాకోలా లాంటి కోల్డ్ డ్రింక్స్‌లో ఉండే అధిక ఆసిడ్ గుణం మాడిన బొగ్గును ఈజీగా కరిగిస్తుంది. మాడిన కడాయిలో కొద్దిగా కూల్ డ్రింక్ పోసి, స్టవ్‌పై తక్కువ మంట మీద వేడి చేయండి. అది వేడెక్కే కొద్దీ మాడిన మచ్చలు వదులైపోతాయి. ఆ తర్వాత నార్మల్ గా కడిగేసుకుంటే సరిపోతుంది.

ముఖ్యమైన హెచ్చరిక..

గిన్నె మాడిపోయిన వెంటనే స్క్రబ్బర్‌తో పెట్టి గట్టిగా రుద్దకండి. అలా చేయడం వల్ల పాత్రల కోటింగ్ లేదా లోహం దెబ్బతింటుంది. దీనివల్ల తదుపరి సారి వంట చేసినప్పుడు ఆహారం ఇంకా వేగంగా మాడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పైన చెప్పిన చిట్కాలతో ముందుగా ఆ మాడిన భాగాన్ని మెత్తబరిచాకే క్లీన్ చేయండి.

Follow Us
మాడిపోయిన గిన్నెలను 5 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే ట్రిక్స్..
మాడిపోయిన గిన్నెలను 5 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే ట్రిక్స్..
బెడ్‌రూమ్‌లో టీవీ ఉంచడం శుభమా అశుభమా? చిన్న పొరపాటుతో పెద్ద సమస్య
బెడ్‌రూమ్‌లో టీవీ ఉంచడం శుభమా అశుభమా? చిన్న పొరపాటుతో పెద్ద సమస్య
ఉదయం అతనికి 57 ఏళ్లు, మధ్యాహ్నానికల్లా 25 ఏళ్ల కుర్రాడు!
ఉదయం అతనికి 57 ఏళ్లు, మధ్యాహ్నానికల్లా 25 ఏళ్ల కుర్రాడు!
ఊరు నుంచి ఆ హీరోకి తలకాయ కూర పంపించా..
ఊరు నుంచి ఆ హీరోకి తలకాయ కూర పంపించా..
వైభవ్ వైఫల్యంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు
వైభవ్ వైఫల్యంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు
ఆ హీరోతో 40 సినిమాలు చేశా.. పుట్టిన రోజున బంగారు గాజు ఇచ్చారు
ఆ హీరోతో 40 సినిమాలు చేశా.. పుట్టిన రోజున బంగారు గాజు ఇచ్చారు
జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలా? చియా సీడ్స్ తినడానికి సరైన సమయం
జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలా? చియా సీడ్స్ తినడానికి సరైన సమయం
స్టేజ్‌పైనే ఏడ్చేసిన రావు బహదూర్ హీరోయిన్
స్టేజ్‌పైనే ఏడ్చేసిన రావు బహదూర్ హీరోయిన్
చిరుతకే చెమటలు పట్టించిన జింకపిల్ల.. కొండల మధ్య వేటాడే సీన్
చిరుతకే చెమటలు పట్టించిన జింకపిల్ల.. కొండల మధ్య వేటాడే సీన్
అనారోగ్య సమస్యలతో పత్యం చేసేవాళ్ళు తినగలిగే పేదింటి కారం పొడి..
అనారోగ్య సమస్యలతో పత్యం చేసేవాళ్ళు తినగలిగే పేదింటి కారం పొడి..