AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఊరు నుంచి ఆ హీరోకి తలకాయ కూర పంపించా.. ఫోన్ చేసి ఆయన అన్నమాటలకు షాక్ అయ్యా..!!

జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కమెడియన్స్ లో రచ్చ రవి ఒకరు. ఎన్నో రకాల స్కిట్స్ చేసి నవ్వులు పూయించాడు రవి. జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోల్లోనూ కనిపించి మెప్పించాడు. ఇన్నాళ్లు బుల్లితెరపై సందడి చేసిన రచ్చ రవి.. ఇప్పుడు వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు.

ఊరు నుంచి ఆ హీరోకి తలకాయ కూర పంపించా.. ఫోన్ చేసి ఆయన అన్నమాటలకు షాక్ అయ్యా..!!
Ravi
Rajeev Rayala
|

Updated on: Jul 05, 2026 | 12:40 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటుడు రచ్చ రవి. జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు రచ్చ రవి. నందమూరి బాలకృష్ణతో జబర్దస్త్ రచ్చ రవికి ఏర్పడిన అనుబంధం, ఆయన వ్యక్తిత్వంపై రవి గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బాలయ్యతో తనకున్న ప్రత్యేకమైన జ్ఞాపకాలను, ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని పంచుకున్నారు. రవి మాట్లాడుతూ.. రవి బాలకృష్ణకు ప్రత్యేకంగా తన స్వగ్రామం నుంచి ప్రేమగా తలకాయ కూర పంపిన ఘటనతో వారి బంధం మరింత బలపడిందని. బాలయ్య ఆ కూరను మెచ్చుకుంటూ, బాలయ్య తనకు స్వయంగా ఫోన్ చేసి, “టిఫిన్లో తిన్న, లంచ్లో తిన్న, ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరీ తిన్న రవి. టేస్ట్ చాలా బాగుంది. అమ్మకు చెప్పు. అమ్మ దీవెనలు నాకు, నా దీవెనలు నీకు ఎప్పుడూ ఉంటాయి” అని చెప్పడం రవిని ఎంతగానో ఆశ్చర్యపరిచిందట. ఒక పెద్ద స్టార్ స్వయంగా ఇలా ఫోన్ చేసి అభినందించడం, ఆశీర్వదించడం రవికి జీవితంలో మరిచిపోలేని అనుభూతినిచ్చిందని తెలిపాడు.

ఆ తర్వాత, దుబాయ్‌లో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో బాలకృష్ణ తనను “రచ్చ రవన్న” అని పిలవడం రవికి ఇంకో అద్భుతమైన క్షణంగా నిలిచిందని అన్నారు. “ఆయనకున్న హోదాకు నన్ను రవి అనొచ్చు, ఒరేయ్ అనొచ్చు, తమ్ముడు అనొచ్చు. కానీ బాలయ్య బాబు గారి నోట్లోకెళ్ళి రచ్చ రవన్న అని పిలిపించుకుంటే ఎట్లుంటది అన్న?” అని రవి ఆనందంగా పంచుకున్నారు. ఈ సంఘటన బాలకృష్ణ అందరి పట్ల చూపించే అపారమైన గౌరవానికి నిదర్శనమని రవి తెలిపారు.

భగవంత్ కేసరి సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ ప్రదర్శించిన క్రమశిక్షణ, వినయం రవిని ఎంతగానో ఆకట్టుకున్నాయట. రాత్రిపూట షూటింగ్‌లు అయినప్పుడు, తెల్లవారుజామున రెండు గంటలకు కూడా, బాలకృష్ణ వెళ్లే ముందు డైరెక్టర్ అనిల్ రావిపూడి, నటి కాజల్, కెమెరామెన్‌కి చెప్పి, వారి అనుమతి తీసుకుని వెళ్లేవారట. “రచ్చ రవన్న ఎక్కడ ఉన్నాడు అని అడిగి, నేను వెళ్లొస్తా, మళ్ళీ నేను మూడన్నరకే లేవాలి” అని చెప్పి వెళ్లడం ఆయన ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. ఈ సంఘటనల ద్వారా బాలయ్య ఎంత పద్ధతిగా, మర్యాదగా ఉంటారో రవి తెలిపారు. సాధారణంగా బాలకృష్ణ గురించి వినే అనేక విషయాలు నిజం కాదని, స్వయంగా కలిశాక ఆయన మర్యాద, క్రమశిక్షణ తనను ఆశ్చర్యపరిచాయని రవి స్పష్టం చేశారు. చిన్న ఆర్టిస్టులైనా, పెద్ద ఆర్టిస్టులైనా అందరినీ ఒకేలా గౌరవిస్తారని, ఆయనలో చిన్న, పెద్ద తేడాలు ఉండవని రవి ప్రశంసించారు. పనిలో తప్పు చేసినవారిపైనే ఆయన ఆవేశం తప్ప, దర్శకులు, నిర్మాతలు వంటివారిపై కాదని, బాలకృష్ణ వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూసి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని రచ్చ రవి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఊరు నుంచి ఆ హీరోకి తలకాయ కూర పంపించా..
ఊరు నుంచి ఆ హీరోకి తలకాయ కూర పంపించా..
వైభవ్ వైఫల్యంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు
వైభవ్ వైఫల్యంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు
ఆ హీరోతో 40 సినిమాలు చేశా.. పుట్టిన రోజున బంగారు గాజు ఇచ్చారు
ఆ హీరోతో 40 సినిమాలు చేశా.. పుట్టిన రోజున బంగారు గాజు ఇచ్చారు
జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలా? చియా సీడ్స్ తినడానికి సరైన సమయం
జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలా? చియా సీడ్స్ తినడానికి సరైన సమయం
స్టేజ్‌పైనే ఏడ్చేసిన రావు బహదూర్ హీరోయిన్
స్టేజ్‌పైనే ఏడ్చేసిన రావు బహదూర్ హీరోయిన్
చిరుతకే చెమటలు పట్టించిన జింకపిల్ల.. కొండల మధ్య వేటాడే సీన్
చిరుతకే చెమటలు పట్టించిన జింకపిల్ల.. కొండల మధ్య వేటాడే సీన్
అనారోగ్య సమస్యలతో పత్యం చేసేవాళ్ళు తినగలిగే పేదింటి కారం పొడి..
అనారోగ్య సమస్యలతో పత్యం చేసేవాళ్ళు తినగలిగే పేదింటి కారం పొడి..
బంగారు అభరణాలపై రుణం తీసుకుంటున్నారా? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు
బంగారు అభరణాలపై రుణం తీసుకుంటున్నారా? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు
పంక్షన్‌ కోసం చెన్నై వెళ్లారు.. తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఘోరం..
పంక్షన్‌ కోసం చెన్నై వెళ్లారు.. తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఘోరం..
వామ్మో వర్షాకాలంలో పుదీనా తింటే ఇన్ని కష్టాలా? ఆయుర్వేదం ప్రకారం
వామ్మో వర్షాకాలంలో పుదీనా తింటే ఇన్ని కష్టాలా? ఆయుర్వేదం ప్రకారం