టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే వరుస ఆఫర్స్ అందుకుంటుంది బీటౌన్ బ్యూటీ జాన్వీ కపూర్. హిందీలో వైవిధ్యమైన సినిమాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీపై కన్నేసింది. ఇప్పటికే తెలుగులో దేవర చిత్రంలో నటిస్తుంది. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీలో తంగం పాత్రలో కనిపించనుంది. ఇందులో అచ్చ తెలుగు గ్రామీణ అమ్మాయిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ రిలీజ్ కాకుండానే మరో ఆఫర్ కొట్టేసింది జాన్వీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జోడిగా వెండితెరపై సందడి చేయనుంది. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సన, చరణ్ కాంబోలో రానున్న RC16లో ఛాన్స్ అందుకుంది. ఈ విషయాన్ని ఇటీవల మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. అటు తమిళం, కన్నడలో అవకాశాలు వస్తే తప్పకుండా నటించేందుకు రెడీగా ఉన్నానని చెబుతుంది. కానీ ఇప్పుడు తెలుగులో మరో ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటున్న జాన్వీ ఇప్పుడు ఏకంగా సమంత ప్లేస్ కొట్టేసిందని టాక్ నడుస్తుంది. ఇన్నాళ్లు కథానాయికగా అలరించిన జాన్వీ.. ఇప్పుడు స్పెషల్ సాంగ్ చేసేందుకు రెడీ అయ్యింది. పుష్ప 2 చిత్రంలో ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ చేయనుందని టాక్ వినిపిస్తుంది. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప మూవీలో సామ్ ‘ఊ అంటావా ఊహు అంటావా’ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట అప్పట్లో ఏ రేంజ్ సెన్సెషన్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఇందులో సామ్ ఎక్స్ప్రెషన్స్… డాన్స్ స్టెప్పులతో ఉర్రూతలుగించింది. ఇక పుష్ప 2లోనూ మరో స్పెషల్ సాంగ్ ఉందని ప్రచారం నడుస్తుంది. ఈ పాటలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలా మంది హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. కానీ మరోసారి ఈ సెకండ్ పార్ట్ లో సామ్ కనిపించనుందని టాక్ నడిచింది.
కానీ ఇప్పుడు సామ్ కాకుండా ఈ స్పెషల్ పాటలో జాన్వీని ఎంపిక చేశారని అంటున్నారు. ఈ విషయంపై చిత్రయూనిట్ నుంచి క్లారిటీ రాలేదు. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ఫహద్ ఫాజిల్, రష్మిక మందన్నా, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషఇస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది పుష్ప 2ను రిలీజ్ చేయనున్నారు. మరోవైపు సామ్ ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.