Janhvi Kapoor: ఆ దర్శకుడితో కలిసి మహా కాళేశ్వర ఆలయంలో జాన్వీ కపూర్ పూజలు.. ఫోటోస్ వైరల్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న దేవర చిత్రంలో జాన్వీ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇందులో తంగం పాత్రలో కనిపించనుంది జాన్వీ. ఇటు తెలుగు, అటు హిందీ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న జాన్వీకి దైవ భక్తి కూడా ఎక్కువే. సమయం దొరికినప్పుడల్లా.. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటుంది జాన్వీ. అలాగే దక్షిణాదిలోని పలు ఆలయాలను సందర్శిస్తుంటుంది. తాజాగా ఉజ్జయినిలోని మహా కాళేశ్వరాలయానికి వెళ్లింది.

Janhvi Kapoor: ఆ దర్శకుడితో కలిసి మహా కాళేశ్వర ఆలయంలో జాన్వీ కపూర్ పూజలు.. ఫోటోస్ వైరల్..
Janhvi Kapoor

Updated on: Dec 07, 2023 | 3:47 PM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో జాన్వీ కపూర్ ఒకరు. ధడక్ సినిమాతో తెరంగేట్రం చేసి తొలి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది.ఆ తర్వాత విభిన్న కంటెంట్ చిత్రాలు.. లేడీ ఓరియెంటెడ్ కథలను ఎంచుకుంటూ కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న దేవర చిత్రంలో జాన్వీ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇందులో తంగం పాత్రలో కనిపించనుంది జాన్వీ. ఇటు తెలుగు, అటు హిందీ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న జాన్వీకి దైవ భక్తి కూడా ఎక్కువే. సమయం దొరికినప్పుడల్లా.. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటుంది జాన్వీ. అలాగే దక్షిణాదిలోని పలు ఆలయాలను సందర్శిస్తుంటుంది. తాజాగా ఉజ్జయినిలోని మహా కాళేశ్వరాలయానికి వెళ్లింది. తన ప్రియుడు శిఖర్ బహారియాతో కలిసి జాన్వీ మహా కాలేశ్వర్ స్వామిని దర్శించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

కేవలం జాన్వీ మాత్రమే కాకుండా.. ఆమెతోపాటు.. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ, అతని భార్య ప్రియ సైతం ఆ ఫోటోలలో కనిపిస్తున్నారు. దీంతో వీరంతా కలిసి వెళ్లారా ? లేదా అక్కడ అనుహ్యంగా కలిశారా ?అనేది తెలియరాలేదు. ఇటీవలే షారుఖ్ ప్రధాన పాత్రలో జవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అట్లీ. ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు హిందీలో వరుణ్ ధావత్ తో కలిసి థేరి సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్ నటిస్తుందని ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలో తేరీ రీమేక్ పనులు ప్రారంభించేందుకే అట్లీ, జాన్వీ మహా కాళేశ్వరుని ఆశీర్వాదం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.

అయితే కొద్ది రోజుల క్రితం థేరీ రీమేక్ లో కీర్తి సురేష్ నటించనుందని టాక్ వినిపించింది. అలాంటి సమయంలో కీర్తి గుడికి వెళ్లాలని.. అలా కాకుండా జాన్వీ కనిపించడంతో ఈ సినిమాలో జాన్వీ కథానాయికగా నటిస్తుందని కన్ఫామ్ అయ్యిందంటున్నారు. అయితే ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. జవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించిన అట్లీ.. ఇప్పుడు తన రెండవ సినిమాను సైతం భారీ స్థాయిలో రూపొందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. కొన్నాళ్లుగా జాన్వీ డేటింగ్ విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇన్నాళ్లుగా సింగిల్ గా ఉన్న జాన్వీ మరోసారి తన మాజీ ప్రియుడు శిఖర్ బహారియాతో ప్రేమలో పడిందంటూ టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో వీరిద్దరు కలిసి ఇటీవల దేవాలయాలు, రెస్టారెంట్స్ లలో కలిసి కనిపిస్తున్నారు. శిఖర్ బహారియా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు. ఇటీవల ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగిన వినాయగర్ చతుర్థి వేడుకలో శిఖర్, జాన్వీలు పాల్గొని అద్భుతంగా డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.