Janhvi Kapoor: “అబ్బాయిలు నాలో ముందుగా చూసేది అవే”..! జాన్వీ ఆన్సర్‌కు మైండ్ బ్లాక్ అయ్యింది గురూ.!

ఇప్పుడు టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది ఈ హాట్ బ్యూటీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడీగా ఆమె దేవర సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే జాన్వీ ఆమె సోదరి ఖుషీ కపూర్ 'కాఫీ విత్ కరణ్ సీజన్ 8'కి గెస్ట్ లుగా హాజరయ్యారు. ఈ ఇంట్రవ్యూలో ఇద్దరు భామలు చాలా విషయాలు తెలిపారు. తమ కెరీర్ అలాగే రాబోయే సినిమాల గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Janhvi Kapoor: అబ్బాయిలు నాలో ముందుగా చూసేది అవే..! జాన్వీ ఆన్సర్‌కు మైండ్ బ్లాక్ అయ్యింది గురూ.!
Janhvi Kapoor

Updated on: Jan 05, 2024 | 6:47 PM

అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.   దఢక్ సినిమాతో హీరోయిన్ గా మారిన జాన్వీ. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ మెప్పిస్తుంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది ఈ హాట్ బ్యూటీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడీగా ఆమె దేవర సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే జాన్వీ ఆమె సోదరి ఖుషీ కపూర్ ‘కాఫీ విత్ కరణ్ సీజన్ 8’కి గెస్ట్ లుగా హాజరయ్యారు. ఈ ఇంట్రవ్యూలో ఇద్దరు భామలు చాలా విషయాలు తెలిపారు. తమ కెరీర్ అలాగే రాబోయే సినిమాల గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దీంతో పాటు జాన్వీ  చెప్పిన ఓ విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘కాఫీ విత్ కరణ్’ ఎన్నో వివాదాలను సృష్టించిన విషయం తెలిసిందే . కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో సెలబ్రెటీల పర్సనల్  గురించి కూడా ప్రశ్నలు అడుగుతారు. దీనికి చాలా మంది సెలబ్రిటీలు ఓపెన్‌గా సమాధానమిస్తున్నారు. ఇక జాన్వీ కూడా ఇప్పుడు దాపరికం లేకుండా సమాధానం చెప్పుకొచ్చింది.

కరణ్ జోహార్ షోలో రాపిడ్ ఫైర్ రౌండ్  జరిగింది. కరణ్ జోహార్ జాన్వీ కపూర్‌ తన పర్సనల్ విషయాలను కూడా పంచుకుంది ఈ షోలో అలాగే  ‘అబ్బాయిలు నిన్ను చూడగానే ముందుగా గమనించేది ఏమిటి?’ అని అడిగాడు కరణ్. దీనికి జాన్వీ కపూర్ సూటిగా సమాధానం ఇచ్చింది. ‘అందరూ నా కళ్లను చూస్తున్నారని అంటున్నారు. కానీ, వాళ్ల కళ్లు మాత్రం అటువైపు ఉంటాయి’ అని కొంటెగా చెప్పింది జాన్వీ. ఈ వీడియో వైరల్‌గా మారింది. అయితే జాన్వీ చెప్పింది దేనిగురించి అని ఇప్పుడు నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.

అంతే కాదు కరణ్ జోహార్ తన డేటింగ్ గురించి ఓపెన్ చేశాడు. జాన్వీ, ఖుషీ ఇద్దరికీ బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారని కరణ్ అన్నారు. జాన్వీ కపూర్ ‘దేవర’ సినిమాతో బిజీగా ఉంది. ఈ సినిమాలో ఆమె జూనియర్ ఎన్టీఆర్‌కి జోడీగా నటిస్తోంది. షూటింగ్ మధ్యలో ఈరోజు (జనవరి 5) తిరుపతికి వెళ్లి వెంకటేశ్వరుని దర్శనం చేసుకున్నారు. ‘ది ఆర్చీస్’ సినిమాతో ఖుషీ తనసినీ జర్నీని ప్రారంభించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి