Janvhi Kapoor: జాన్వీకి ఖరీదైన కానుక ఇచ్చిన బిర్లా వారసురాలు.. అసలు ఎవరీ అనన్య.. ?

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఇప్పుడు సౌత్ పై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబోలో రాబోతున్న పెద్ది చిత్రంలో నటిస్తుంది. అలాగే హిందీ, తెలుగులో మరిన్ని ఆఫర్స్ వస్తే చేయడానికి సిద్ధంగా ఉంది.

Janvhi Kapoor: జాన్వీకి ఖరీదైన కానుక ఇచ్చిన బిర్లా వారసురాలు.. అసలు ఎవరీ అనన్య.. ?
Janhvi Kapoor

Updated on: Apr 12, 2025 | 10:51 AM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ధడక్ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత విభిన్న సినిమాలను ఎంచుకుంటూ నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఇన్నాళ్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతున్న జాన్వీ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. గతేడాది యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబోలో రాబోతున్న పెద్ది చిత్రంలో నటిస్తుంది. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ షాట్ గ్లింప్స్ అదిరిపోయింది. ఇదంతా పక్కన పెడితే.. తాజాగా జాన్వీకి బిర్లా వారసురాలు అనన్య ఊహించని కానుక పంపించారు.

రూ.5 కోట్లు విలువ చేసే లంబోర్గిని కారును జాన్వీకి కానుకగా పంపించింది బిర్లా వారసురాలు అనన్య. ఈ మేరకు శుక్రవారం ఉదయం పర్పుల్ కలర్ లంబోర్గిని కారును జాన్వీ నివాసానికి పంపించారు. ఆ కారుతోపాటు మరో గిఫ్ట్ సైతం అందులో ఉంచారు. దానిపై ప్రేమతో నీ అనన్య అని రాసి ఉంది. జాన్వీ నివాసానికి లంబోర్గిని కారు వెళ్తున్న విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అనన్య.. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం కుమార్తె.

ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ బోర్డ్ డైరెక్టర్లలో అనన్య ఒకరు. 17 ఏళ్ల వయసులోనే స్వతంత్ర మైక్రోఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తన మొదటి సంస్థను స్థాపించారు. బారత్ లోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న మైక్రోఫైనాన్స్ సంస్థల్లో ఇది కూడా ఒకటి. వ్యాపారవేత్తగానే కాకుండా అనన్య గాయనిగా కూడా ఫేమస్. పలు ప్రైవేట్ ఆల్బమ్స్ కోసం పనిచేశారు. అనన్య, జాన్వీ మంచి స్నేహితులు. ఇక త్వరలోనే అనన్య స్టార్ట్ చేయబోయే కాస్మోటిక్స్ వ్యాపారానికి జాన్వీ బ్రాండ్ అంబాసిడర్.

ఇవి కూడా చదవండి :  

Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్

Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‎లోకి.. పరుగు మూవీ హీరోయిన్‏ను ఇప్పుడే చూస్తే షాకే..

Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..

OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?