రామారావు వర్సెస్‌ రామ్‌చరణ్‌.. మధ్యలో జాన్వీ.! కహానీ ఏంటంటారా.?

ఏదైనా నేను దిగనంత వరకే... ఒన్స్ ఐ స్టెప్‌ ఇన్‌ హిస్టరీ రిపీట్స్...! ఇది నిన్నటిదాకా బాలయ్య డైలాగ్‌. ఇప్పుడు జాన్వీ ఫాలో అవుతున్న పాత్‌. మీరందరూ ట్రిపుల్‌ ఆర్‌ గురించి విని ఉంటారు... ఇప్పుడు నేను ఆ సినిమాలో నటించిన డబుల్‌ ఆర్‌ మీద కాన్‌సెన్‌ట్రేట్‌ చేస్తున్నాను అని అంటున్నారు అతిలోక సుందరి తనయ.

రామారావు వర్సెస్‌ రామ్‌చరణ్‌.. మధ్యలో జాన్వీ.! కహానీ ఏంటంటారా.?
Janhvi Kapoor

Edited By:

Updated on: Sep 23, 2023 | 8:00 PM

ఏదైనా నేను దిగనంత వరకే… ఒన్స్ ఐ స్టెప్‌ ఇన్‌ హిస్టరీ రిపీట్స్…! ఇది నిన్నటిదాకా బాలయ్య డైలాగ్‌. ఇప్పుడు జాన్వీ ఫాలో అవుతున్న పాత్‌. మీరందరూ ట్రిపుల్‌ ఆర్‌ గురించి విని ఉంటారు… ఇప్పుడు నేను ఆ సినిమాలో నటించిన డబుల్‌ ఆర్‌ మీద కాన్‌సెన్‌ట్రేట్‌ చేస్తున్నాను అని అంటున్నారు అతిలోక సుందరి తనయ. రామారావు వర్సెస్‌ రామ్‌చరణ్‌.. మధ్యలో జాన్వీ కహానీ ఏంటంటారా… చూసేద్దాం రండి..!

జాన్వీ జోరు మామూలుగా లేదు. నార్త్ లో రీసెంట్‌గా బవాల్‌తో బెస్ట్ పెర్ఫార్మర్‌ అనిపించుకున్నార. ఓటీటీలో విడుదలైంది కానీ, థియేటర్లలో రిలీజ్‌ అయి ఉంటే, కలెక్షన్లు కొల్లగొట్టి ఉండేదని అంటున్నారు ట్రేడ్‌ పండిట్స్. ఆ సినిమాకు వచ్చిన సక్సెస్‌ టాక్‌తో హ్యాపీగా ఉన్నారు జాన్వీ. అదే జోష్‌తో తారక్‌ పక్కన దేవర షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

తారక్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయనతో సినిమా అంటే చాలా ఆనందంగా అనిపించింది. వెంటనే ఒప్పుకున్నాను అని దేవర గురించి మనసులో మాటలను సందర్భం వచ్చిన ప్రతిసారీ పంచుకుంటూనే ఉన్నారు మిస్‌ జాన్వీ కపూర్‌. తారక్‌ ప్రేమదేశపు యువరాణిగా జాన్వీని చూడటానికి క్యూరియస్‌గా ఎదురుచూస్తున్నారు నందమూరి అభిమానులు.

దేవర సినిమా ఇంకా రిలీజ్‌ కానేలేదు, అప్పుడే టాలీవుడ్‌లో సెకండ్‌ ఛాన్స్ కొట్టేశారు మేడమ్‌ జాన్వీ. బుచ్చిబాబు డైరక్షన్‌లో రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న సినిమా జాన్వీని నాయికగా ఎంపిక చేసుకున్నట్టు న్యూస్‌ వైరల్‌ అవుతోంది. ఆల్రెడీ రామారావు పక్కన నటిస్తున్న జాన్వీ, రామ్‌చరణ్‌తోనూ స్టెప్పులేస్తారని తెలిసి ట్రిపుల్‌ ఆర్‌ హీరోల సినిమాలను శ్రీదేవి కూతురు భలేగా ప్లాన్‌ చేసుకున్నారనే అని వండర్‌ అవుతున్నారు ఆడియన్స్.

ఇక జాన్వి కపూర్ లేటెస్ట్ ఫోటోస్‌పై.. ఈ ఇన్‌స్టాగ్రామ్ లింక్స్‌లో చూడండి..

పింక్ కలర్ డ్రెస్‌లో జాన్వి అందాలు..

శారీలో జాన్వి కపూర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.