ప్రజా పోరాటాలకు తన పాటలతో ఊపిరిపోసిన ప్రజాయుద్ధ నౌక శాశ్వతంగా మూగబోయింది. ప్రజా గాయకుడు గుమ్మడి విఠల్‌రావ్ అలియాస్ గద్దర్ హఠాన్మరణం పాలయ్యారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. కాగా గద్దర్ మరణవార్త విని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తల్లడిల్లిపోయారు. ఇక గద్దర్ గళం వినిపించదని తెలిసి శోకసంద్రంలో మునిగిపోయారు. ఈనేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు గద్దర్‌కు నివాళి అర్పిస్తున్నారు. సీఎం కేసీఆర్, ముఖ్యమంత్రి జగన్ గద్దర్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఇక గద్దర్ అంటే ఎంతో అభిమానం చూపించే జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ గద్దర్ మరణవార్త విని షాక్ కు గురయ్యారు. కొద్ది రోజుల క్రితమే అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గద్దర్‌ను పవన్ పరామర్శించారు. స్వయంగా అక్కడకు వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఇది జరిగిన కొన్నిరోజులకే గద్దర్ కన్నుమూయడంతో పవన్ భావోద్వేగానికి లోనయ్యారు. ఎల్బీ స్టేడియంలో గద్దర్ భౌతిక కాయానికి పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. గద్దర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాడ సానుభూతి తెలిపారు.
‘గద్దరన్న మరణించారంటే నమ్మశక్యంగా లేదు. కొన్ని రోజుల క్రితమే ఆయనను పరామర్శించేందుకు ఆస్పత్రిగా వెళ్లాను. తమ్ముడా అంటూ ఆప్యాయంగా పలకరించారు. నీ అవసరం నేటి యువతకు ఉందంటూ తనకు చెప్పిన మాటలు నా జీవితంలో మర్చిపోలేను. గద్దర్ మరణం రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ఎమోషనల్ అయ్యారు పవన్ కల్యాణ్. కాగా ప్రజా సంద్శనార్థం గద్దర్ భౌతిక కాయాన్ని ఎల్బీ స్టేడియంలో ఉంచారు. సోమవారం (ఆగస్టు 7) అల్వాల్‌లోని మహాభోది స్కూల్ గ్రౌండ్‌లో గద్దర్ అంత్యక్రియలు జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరపాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
తుది శ్వాస విడిచిన ప్రజా గాయకుడు శ్రీ గద్దర్ గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు. గద్దర్ గారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.#Gaddar pic.twitter.com/5Ss0AtMhxa
— JanaSena Party (@JanaSenaParty) August 6, 2023
ప్రజా యోధుడు గద్దర్ – JanaSena Chief Shri @PawanKalyan #Gaddar pic.twitter.com/Fcx9MYIlcZ
— JanaSena Party (@JanaSenaParty) August 6, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..