అయోధ్యలో రామ మందిర పునఃప్రతిష్ఠాపనకు ముహూర్తం సమీపిస్తోంది. ఈనెల 22న మధ్యాహ్నం 12.20 గంటలకు శాస్త్రోక్తంగా శ్రీరాముడి పట్టాభిషేక కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రామ మందిర పునఃప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే దేశంలోని వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. తాజాగా పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది. బుధవారం (జనవరి 03) మధ్యాహ్నం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్ఎస్ఎస్ ప్రాంత సంపర్క ప్రముఖ్ ముళ్లపూడి జగన్, వీహెచ్‌పీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస రెడ్డి, ఆర్.ఎస్.ఎస్. కార్యాలయ ప్రముఖ్ పూర్ణ ప్రజ్ఞ పవన్ కల్యాణ్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా అయోధ్యలో నిర్మితమైన రామాలయం విశేషాలను, రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి సంబంధించిన విశేషాలను పవన్ కల్యాణ్ కు తెలియజేశారు.
కాగా అయోధ్య రామ మందిరం నిర్మాణం ప్రారంభం కాగానే పవన్ కల్యాణ్ 30 లక్షల రూపాయలు శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌కు విరాళంగా అందజేశారు. 2021లో తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో విరాళానికి సంబంధించిన చెక్కును శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రతినిధులకు అందజేశారు పవన్. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించి మంగళవారం (జనవరి 03) తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు కూడా ఆహ్వానం అందింది. ప్రముఖ బీజేపీ నాయకుడు అర్జు మూర్తి రజనీకాంత్ ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రం అందించారు. వీరితో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, వ్యాపార దిగ్గజం రతన్ టాటాలకు కూడా ఆహ్వానం అందింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ లకు కూడా ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. అమితాబ్, యష్, సన్నీడియోల్, రాజ్ కుమార్ హిరానీ, సంజయ్ లీలా భన్సాలి, రోహిత్ శెట్టి తదితరులు కూడా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాలు అందుకున్నారని తెలుస్తోంది.
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి శ్రీ @PawanKalyan గారికి ఆహ్వానం#AyodhyaRamMandir pic.twitter.com/ouy8cTOB7f
— JanaSena Party (@JanaSenaParty) January 3, 2024
எனது வாழ்நாளில் கிடைத்த அரும்பாக்கியமாக இன்றைய நிகழ்வு அமைந்தது!
நம் அன்பு தலைவர் திரு. @rajinikanth அவர்களை அவரது இல்லத்தில் சென்று அயோத்தி, ராம ஜன்மபூமி தீர்த்த க்ஷேத்ரா சார்பில் அவரது குடும்பத்தினரையும் ஜனவரி 22 ம்தேதி அயோத்தி கும்பாபிஷேக நிகழ்வுக்கு வரவேண்டி ஆர்.எஸ்.எஸ்… pic.twitter.com/UcHakkRdLW
— Ra.Arjunamurthy | ரா.அர்ஜூனமூர்த்தி (@RaArjunamurthy) January 2, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి