Jagapathi Babu Annaatthe Movie : రజనీతో ముచ్చటగా మూడోసారి.. మరోసారి నెగిటివ్ రోల్‌లో అలరించనున్న జగ్గూబాయ్..

Jagapathi Babu Annaatthe Movie : సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో 'అన్నాత్తె' సినిమా

Jagapathi  Babu Annaatthe Movie : రజనీతో ముచ్చటగా మూడోసారి.. మరోసారి నెగిటివ్ రోల్‌లో అలరించనున్న జగ్గూబాయ్..
Jagapathi Babu

Updated on: Mar 17, 2021 | 6:24 PM

Jagapathi Babu Annaatthe Movie : సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ‘అన్నాత్తె’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈ మూవీకి బ్రేక్ పడింది. తిరిగి గతేడాది డిసెంబర్‏లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించారు. షూటింగ్ స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే యూనిట్ సభ్యులలో నలుగురికి కరోనా రావడం, రజినీ అస్వస్తతకు గురికావడంతో మళ్లీ ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. అయితే ఈ మూవీకి సంబంధించి మరో అప్‌డేట్‌ ఇప్పుడు చక్కర్లు కొడుతుంది.

ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ ట్విట‌ర్ ద్వారా షేర్ చేసుకుంది. ప్ర‌ముఖ టాలీవుడ్ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు ర‌జనీకాంత్‌తో ముచ్చ‌ట‌గా మూడోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. జ‌గ్గూబాయ్ అన్నాత్తె టీంలో జాయిన్ అయిన‌ట్టు స‌న్ పిక్చ‌ర్స్ ట్వీట్ ద్వారా తెలిపింది. క‌ థానాయ‌కుడు, లింగా చిత్రాల ద్వారా ర‌జ‌నీ-జ‌గ‌ప‌తిబాబు కాంబినేష‌న్‌లో ఇది మూడో సినిమా. నయ‌న‌తార‌, కీర్తిసురేశ్‌, మీనా, ఖుష్బూ కీ రోల్స్ చేస్తున్నారు. డి ఇమ్మాన్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. దీపావ‌ళి కానుకంగా న‌వంబ‌ర్ 4న అన్నాత్తె విడుద‌ల కానుంది.

జగపతి బాబు ప్రధానంగా టాలీవుడ్ సినిమాల్లో పనిచేస్తున్నప్పటికీ, అతను అనేక తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో కూడా చేశాడు. గతంలో, అతను 2014 యాక్షన్-డ్రామా చిత్రం లింగా కోసం నటుడు రజనీకాంత్ తో కలిసి పనిచేశాడు . విజయ్ సేతుపతి, శ్రుతి హాసన్ రాబోయే చిత్రం లాబామ్ లో కూడా ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. రజినీ చివరిసారిగా ఏఆర్ మురుగదాస్ 2020 చిత్రం దర్బార్ లో కనిపించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. ఈ చిత్రంలో కొన్నిపంచ్‌ డైలాగులు రజనీయే స్వయంగా రాసినట్లు తెలుస్తోంది. అన్నాతే విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

 

ఈ ఆటో డ్రైవర్ మామూలోడు కాదు.. ఒక్క వీడియోతో సినిమాలో ఛాన్స్ పట్టేశాడు.. సెలబ్రిటీ అయిపోయాడు..

ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. తిమింగలంపై షార్క్ దాడి.. చివరికి ఏమైందంటే.!