AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Rohini: రేవ్ పార్టీలో జబర్దస్త్ రోహిణి.. పోలీసుల రాకతో బోరుమన్ననటి.. వీడియో వైరల్

సుమారు రెండు నెలల క్రితం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్ లో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల రైడ్ లో నటి హేమ, హీరో శ్రీకాంత్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తదితరులు దొరికిపోయారంటూ వచ్చిన వార్తలు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక్కసారిగా కుదుపునకు గురి చేశాయి.

Jabardasth Rohini: రేవ్ పార్టీలో జబర్దస్త్ రోహిణి.. పోలీసుల రాకతో బోరుమన్ననటి.. వీడియో వైరల్
Jabardasth Rohini
Basha Shek
|

Updated on: Jul 05, 2024 | 4:59 PM

Share

సుమారు రెండు నెలల క్రితం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్ లో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల రైడ్ లో నటి హేమ, హీరో శ్రీకాంత్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తదితరులు దొరికిపోయారంటూ వచ్చిన వార్తలు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక్కసారిగా కుదుపునకు గురి చేశాయి. అయితే శ్రీకాంత్, కొరియోగ్రాఫర్ జానీలు వీడియోలు రిలీజ్ చేసి తమకు ఆ రేవ్ పార్టీతో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. కానీ హేమ మాత్రం అడ్డంగా దొరికిపోయింది. నటి బ్లడ్ షాంపిల్స్‌లో డ్రగ్స్ ఉందని బెంగళూరు పోలీసులు ఆమెకు నోటీసులు పంపిచారు. ఆ తర్వాత ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ప్రస్తుతం హేమ బెయిల్ పై బయటకు వచ్చారు. తాజాగా మరో రేవ్ పార్టీలో జబర్దస్త్ కమెడియన్, యాంకర్, నటి రోహిణీ పట్టు బడిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇందులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళుతుండగా.. మైకులు పట్టుకుని రిపోర్టర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి రోహిణీ బదులిస్తూ తనకేం సంబంధం లేదని, బర్త్ డే పార్టీ ఉందంటే వచ్చానంది. అయినా విలేకర్లు ఆమెను వదిలిపెట్టకుండా.. మీకు కూడా పాజిటివ్ వచ్చింది కదా? అని ప్రశ్నలేస్తారు. దీనికి రోహిణి.. నాకు టెస్టులే చేయలేదు పాజిటివ్ ఎలా వచ్చిందని ఎదురు ప్రశ్నిస్తుంది. అనంతరం ఎన్ఆర్ఐ బర్త్ డే పార్టీ అనగానే వెనుక ముందు చూడకుండా రాకూడదంటూ బోరున ఏడుస్తుంది.

ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. అయితే దీనిని చూసిన ఎవరికైనా ఇది ఫ్రాంక్ అని ఇట్టే అర్థమైపోయింది. అది ‘బర్త్ డే బాయ్’ ప్రమోషన్ కోసం చేసినట్లు తెలుస్తుంది. వెరైటీగా ఉంటుందని రోహిణి అలా చేసినట్లు సమాచారం. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. బెంగళూరు రేవ్ పార్టీలో హేమ వ్యవహారాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. రోహిణీ ఇన్ డైరెక్టుగా హేమపై సెటైర్లు వేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై హేమ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

జబర్దస్త్ రోహిణీ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Rohini (@actressrohini)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్పుడు సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. శ్రీకాంత్
అప్పుడు సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. శ్రీకాంత్
ఏం రాత రాశావు దేవుడా.. మంటల్లో పిల్లలు.. తట్టుకోలేక భార్య..
ఏం రాత రాశావు దేవుడా.. మంటల్లో పిల్లలు.. తట్టుకోలేక భార్య..
బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?