Jabardasth Rakesh: అమ్మనాన్నలైన జబర్దస్త్ కపుల్! శుభవార్తను గోప్యంగా ఉంచిన రాకేష్, సుజాత! కారణమేంటంటే?

|

Oct 04, 2024 | 12:16 PM

జబర్దస్త్‌ కపుల్ రాకింగ్‌ రాకేష్, జోర్దార్ సుజాతల ఇంట ఆనందం వెల్లివిరిసింది. రాకింగ్ రాకేష్ సతీమణి సుజాత పండంటి బిడ్డను ప్రసవించింది. దీంతో సోషల్ మీడియాలో ఈ ఇద్దరికీ అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ శుభవార్తను గోప్యంగా ఉంచారు రాకేష్, సుజాత. తమకు బిడ్డ పుట్టినట్లు ఇప్పటివరకు అధికారికంగా బయటకు చెప్పలేదు

Jabardasth Rakesh: అమ్మనాన్నలైన జబర్దస్త్ కపుల్! శుభవార్తను గోప్యంగా ఉంచిన రాకేష్, సుజాత! కారణమేంటంటే?
Jabardasth Rakesh Family
Follow us on

 

జబర్దస్త్‌ కపుల్ రాకింగ్‌ రాకేష్, జోర్దార్ సుజాతల ఇంట ఆనందం వెల్లివిరిసింది. రాకింగ్ రాకేష్ సతీమణి సుజాత పండంటి బిడ్డను ప్రసవించింది. దీంతో సోషల్ మీడియాలో ఈ ఇద్దరికీ అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ శుభవార్తను గోప్యంగా ఉంచారు రాకేష్, సుజాత. తమకు బిడ్డ పుట్టినట్లు ఇప్పటివరకు అధికారికంగా బయటకు చెప్పలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరిద్దరు అమ్మనాన్నలయ్యారని పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఇక రాకేశ్ కానీ, సుజాత కానీ షేర్ చేసిన లేటెస్ట్ సోషల్ మీడియా పోస్టుల్లోనూ ఆమె గర్భంతో కనిపించడం లేదు. అందుకు తగ్గట్టుగానే నెటిజన్లు కూడా భిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘డెలివరీ అయిన విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నారు మేడమ్?’ ‘బాబు పుట్టాడా? పాప పుట్టిందా’ అంటూ ప్రశ్నిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా గతంలోనూ సుజాత గర్భం దాల్చిన విషయాన్ని కూడా గోప్యంగా ఉంచారీ జబర్దస్ కపుల్. డైరెక్టుగా సీమంతం ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి శుభవార్తను అందరితో పంచుకున్నారు. ఇప్పుడు డెలివరీ విషయంలోనూ అదే పంథాను ఫాలో అవుతన్నారేమో లవ్లీ కపుల్.

ఇవి కూడా చదవండి

అంతా గోప్యంగానే..

కాగా జబర్దస్త్ లో జంటగా బోలెడు స్కిట్లు చేసి ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాత. ఆ తర్వాతే ఇదే జబర్దస్త్ వేదికపై తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టారు. పెద్దల అనుమతితో గతేడాది ఫిబ్రవరిలో తిరుమల శ్రీవారి సాక్షిగా ఏడడుగులు వేశారు. ఇప్పుడు తమ వైవాహిక బంధానికి ప్రతీకగా ఒక పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారీ క్యూట్ కపుల్.

బతుకమ్మ వేడుకల్లో జోర్దార్ సుజాత..

ఇప్పటికే కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సత్తా చాటిన రాకింగ్ రాకేశ్ త్వరలో హీరోగా నూ ఎంట్రీ ఇవ్వనున్నాడు. కేసీఆర్ పేరుతో ఒక డిఫరెంట్ సినిమాను రాకింగ్ రాకేశ్ పట్టాలెక్కించాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

పిల్లాడి కోసం షాపింగ్.. వీడియో

డెలివరీ కి ముందు ఆధ్యాత్మిక యాత్రలో జబర్దస్త్ కపుల్.. వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.