Jabardasth Vinod: అమ్మబాబోయ్.. జబర్దస్త్ వినోద్ ఏంటి ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.!

|

Dec 16, 2022 | 7:21 PM

కొంతమంది సినిమాల్లో అవకాశాలు దక్కించుకోగా మరికొంతమంది పలు ప్రోగ్రామ్ లు చేసుకుంటున్నారు. ఇక జబర్దస్త్ లో లేడీ గెటప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Jabardasth Vinod: అమ్మబాబోయ్.. జబర్దస్త్ వినోద్ ఏంటి ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.!
Jabardasth Vinod
Follow us on

జబర్దస్త్ కామెడీ షోతో చాలా మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ కామెడీ షో ద్వారా ఎంతో మంది లైఫ్ లు సెటిల్ అయ్యాయని చెప్పొచ్చు. కొంతమంది సినిమాల్లో అవకాశాలు దక్కించుకోగా మరికొంతమంది పలు ప్రోగ్రామ్ లు చేసుకుంటున్నారు. ఇక జబర్దస్త్ లో లేడీ గెటప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అచ్చం అమ్మాయిలా కనిపించి కడుపుబ్బా నవ్విస్తుంటారు. వీరిలో వినోద్ ఒకరు. అమ్మాయి గెటప్ వేస్తే వినోద్ ను నిజంగానే అమ్మాయి అనుకుంటారు అంత అందంగా అనిపిస్తాడు. అయితే వినోద్ పలుసార్లు వార్తల్లో కూడా నిలిచాడు. అప్పుడెప్పుడో తన ఒక వ్యక్తి తనపై దాడి చేశాడని వార్తల్లో నిలిచాడు వినోద్.

ఆ తర్వాత వినోద్ అమ్మాయిగా మారిపోబోతున్నాడు అంటూ కూడా వార్తలు పుట్టుకొచ్చాయి. వాటన్నింటిని ఖండించాడు వినోద్. తాను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని కూడా చెప్పుకొచ్చాడు. అలాగే ఆ తర్వాత వినోద్ ప్రేమించిన అమ్మాయిని కూడా పరిచయం చేశాడు. ఆ తర్వాత వీరికి వివాహం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు వినోద్ గుర్తుపట్టలేనంత గా మారిపోయాడు.

ఇటీవల జబర్దస్త్ లో కూడా కనిపించడం లేదు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయనను చూసి అంతా షాక్ అవుతున్నారు. వినోద్ చాలా మారిపోయాడు. చాలా సన్నగా అవ్వడంతో పాటు మొహంలోను చాలా మార్పు కొనిపిస్తోంది. దీనిపై ఆయన మాట్లాడుతూ.. నాకు కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చాయి. వాటి వల్లే ఇలా మారిపోయాను. నాకు లంగ్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చింది. నేను ఫుడ్‌ చాలా తక్కువ తీసుకుంటాను. నాన్‌వెజ్‌ తినను. లంగ్‌స్లో నీళ్లు చేరాయి. ఇటీవలే వాటిని తీసేశారు. ఆ టెన్షన్‌లో ఫుడ్ తీసుకోవడం తగ్గించాను దాని వల్ల బాగా వీక్ అయ్యాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా.. అని తెలిపాడు వినోద్.

ఇవి కూడా చదవండి

Vinod