
జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదట్లో సీరియల్స్ ద్వారా మొదలైన ప్రయాణం .. ఆ తర్వాత యాంకర్ గా మారింది. జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. కానీ తక్కువ సమయంలోనే ఆ షో నుంచి బయటకు వచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సౌమ్య మాట్లాడుతూ.. వ్యక్తిగత జీవితంలోని పలు సంఘటనలు, బాల్యం నుండి ఎదుర్కొన్న ఆర్థిక, సామాజిక పోరాటాల గురించి పంచుకున్నారు. అలాగే తన తల్లికి సంబంధించిన భావోద్వేగ క్షణాలు, ఆమె పట్ల ఉన్న ప్రగాఢ ప్రేమ, అలాగే కుటుంబ నేపథ్యం గురించి వెల్లడించారు. సౌమ్య రావు స్వస్థలం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని ఒక చిన్న తాలూకు. ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి ప్రశ్నించగా, సౌమ్య స్పష్టంగా “నా ఫాదర్ వాళ్ళు వదిలేయ్. వాళ్ళ గురించి ఏమొద్దు, నో కామెంట్స్” అంటూ మాట్లాడటానికి నిరాకరించారు. అయితే, తన తల్లితో తనకు చాలా బలమైన బంధం ఉందని ఆమె తెలిపారు. సింగిల్ పేరెంట్ కాదని, తన తల్లీదండ్రులు ఇద్దరూ ఉన్నారని సౌమ్య పేర్కొన్నారు.
ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్..
తన జీవితంలో కేవలం కొద్దిమంది వ్యక్తులే తనతో సన్నిహితంగా ఉంటారని, వారి కోసమే తాను జీవిస్తున్నానని సౌమ్య అన్నారు. “ఒక లైఫ్‌లో అందరూ మంచిగా దొరకాలనేది ఒక తలరాత. అందరికీ ఒక మంచి ఫాదర్ దొరకాలి, ఒక మంచి మదర్ దొరకాలి, అందరూ హెల్దీగా ఉండాలి, ఒక మంచి బ్రదర్ దొరకాలి” అంటూ చెప్పుకొచ్చారు. సౌమ్య తన బాల్యాన్ని, తన తల్లి ఎదుర్కొన్న తీవ్రమైన పేదరికాన్ని గుర్తుచేసుకున్నారు. “మా అమ్మకి అప్పుడు చాలా పావర్టీ రా” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికం కారణంగా తన తల్లి సామాజికంగా ఎదుర్కొన్న అవమానాలను సౌమ్య వెల్లడించారు. ఏదైనా శుభకార్యానికి, పెళ్లిళ్లకు వెళ్ళినప్పుడు, మంచి చీరలు, నగలు లేకపోవడం వల్ల బంధువులు తన తల్లిని చిన్నచూపు చూసేవారని ఆమె వివరించారు. “నువ్వు ఎందుకు ముందు ముందుకు వెళ్తావ్? పెళ్లికి వెళ్లి వెళ్తున్నప్పుడు నువ్వు వెనకాల ఉండు” అంటూ తన తల్లిని అవమానించిన తీరును సౌమ్య పంచుకున్నారు.
ఎక్కువమంది చదివినవి : Cinema : నిజమైన సంఘటనల ఆధారంగా సిరీస్.. ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న వెబ్ సిరీస్..
ఈ సంఘటనలు తనను ఎంతగానో బాధించాయని, తన తల్లికి మంచి జీవితాన్ని ఇవ్వాలని, మంచి చీరలు కొనివ్వాలని, ఎల్లప్పుడూ నగలు ధరించి గౌరవంగా ఉండాలని తాను కలలు కన్నానని సౌమ్య తెలిపారు. అయితే, తన ఆశయాలు నెరవేరకముందే, తన తల్లి అనారోగ్యానికి గురై మంచం పట్టారని ఆమె భావోద్వేగంగా వెల్లడించారు. ఈ పరిణామం తనను మానసికంగా ఎంతగానో కుంగదీసిందని సౌమ్య పేర్కొన్నారు. ఈ కష్టాలన్నీ చూసి తాను చాలా అనుభవించానని ఆమె తెలిపారు. అలాగే . “నేనేం పెద్ద పతివ్రతను కాదు, అప్పుడప్పుడు తాగుతాను” అంటూ ఆమె నిర్మొహమాటంగా చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా రెడ్ వైన్ తీసుకోవడం వల్ల మైండ్ ఫ్రెష్‌గా ఉంటుందని, స్కిన్ ఆరోగ్యానికి కూడా మంచిదని ఆమె పేర్కొన్నారు. అయితే, ఇది కేవలం అప్పుడప్పుడు మాత్రమేనని, అలవాటుగా మారకూడదని ఆమె స్పష్టం చేశారు. వైన్ తాగిన తర్వాత సినీ ఇండస్ట్రీలో ఎదురైన కష్టాలు, చేదు అనుభవాల గురించే తాను ఎక్కువగా మాట్లాడుతుంటానని సౌమ్య రావు తెలిపారు. డైరెక్టర్లు, ఆర్టిస్టులు తనకు చేసిన అన్యాయాలు, అవకాశాలు రాకుండా తొక్కేయడం, డైలాగులు లేదా మైక్ ఇవ్వకపోవడం వంటి విషయాలను గుర్తు చేసుకుంటూ ఉంటానని ఆమె చెప్పారు. ఈ కారణంగానే తన స్నేహితులు తనతో కలిసి పార్టీ చేసుకోవడానికి ఆసక్తి చూపరని, “వద్దురా, నువ్వు మాట్లాడితే ఇండస్ట్రీ గురించి మాట్లాడతావ్” అని చెబుతారని ఆమె సరదాగా వివరించారు.
ఎక్కువమంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరో.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. కానీ తెలుగులో అట్టర్ ప్లాప్.. కారణం ఇదే..
ఎక్కువమంది చదివినవి : Rajanna Movie : రాజన్న సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. టాలీవుడ్ నటుడు..