Rashmi Gautam: నేను ఎవరికీ వ్యతిరేకం కాదు..అలాగనీ నా పోరాటం ఆపను.. జబర్దస్త్ యాంకర్ రష్మీ

సినిమాలు, టీవీ ప్రోగ్రామ్స్ సంగతి పక్కన పెడితే రష్మి గౌతమ్ జంతు ప్రేమికురాలు. మూగ జీవాలకు ఎక్కడ హాని జరిగినా వెంటనే తన దైన శైలిలో స్పందిస్తుంటుంది. అందులో భాగంగానే ఇటీవల ఎడ్ల బండిపై ఆటోను పెట్టి ర్యాలీ చేసిన ఓ నేతపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిందీ జబర్దస్త్ యాంకర్.

Rashmi Gautam: నేను ఎవరికీ వ్యతిరేకం కాదు..అలాగనీ నా పోరాటం ఆపను.. జబర్దస్త్ యాంకర్ రష్మీ
Rashmi Gautam

Updated on: May 02, 2026 | 2:31 PM

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఓ పార్టీ నాయకులు ఆమెను టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా వీటికి గట్టిగా బదులిచ్చింది రష్మీ. తనను ట్రోల్ చేస్తోన్న వారికి సోషల్ మీడియా వేదిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ‘ఇలాంటి అవమానాలు వినడం నాకు మొదటిసారి కాదు. నా సోషల్ మీడియా ప్రొఫైల్స్ మొత్తం గమనిస్తే.. పండుగల, జాతర్ల సమయంలో జరిగే జంతుబలిపై కూడా నేను నా గళాన్ని వినిపిస్తూనే ఉన్నాను. అప్పుడు కూడా నన్ను దారుణంగా తిట్టారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు. చివరకు గణపతికి గజమాల వేసే క్రమంలో అంకుశంతో ఏనుగు చర్మాన్ని చీల్చుతుంటే దానిపై ప్రశ్నించినందుకు నన్ను దేశద్రోహి అని పిలిచారు. జంతువులపై జరిగే హింస విషయంలో ప్రజలు ఒక అంశాన్ని మరొకదానితో పోలుస్తూ కాలక్షేపం చేస్తున్నారే తప్ప, పరిష్కార మార్గం గురించి అసలు ఆలోచించట్లేదు. జంతువులపై జరుగుతోన్న హింసపై నేను ఎన్నోసార్లు మాట్లాడాను. భవిష్యత్తులోనూ నా గళాన్ని వినిపిస్తూనే ఉంటాను. ఇక్కడ సమస్య ఏటంటే.. ఒక విషయం గురించి మాట్లాడితే ప్రజలు మరొక విషయాన్ని ముందుకు తెస్తున్నారు. కేవలం పోలికలు చూడటమే తప్ప ఈ జంతు హింసను ఆపడానికి ఎవరూ ముందుకురావడం లేదు. నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఏ పార్టీ అయితే జంతు సంక్షేమం కోసం కృషి చేస్తుందో.. నేను ఆ పార్టీకి బహిరంగంగా మద్దతు ఇస్తాను’ అని రష్మీ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

అసలు ఏం జరిగిందంటే?

పెట్రోల్, డీజీల్ దొరకడం లేదంటూ ఇటీవల ఓ ప్రముఖ రాజకీయ నేత నిరసన చేపట్టారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆటోను ఎడ్ల బండిపై పెట్టి ర్యాలీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన రష్మీ రాజకీయ నిరసనల కోసం జంతువులను హింసించడం సరికాదని ట్వీట్ చేసింది. దీంతో ఆమెపై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ మొదలయ్యాయి.

ఇవి కూడా చదవండి

యాంకర్ రష్మీ ట్వీట్..

వివాదానికి కారణమైన వీడియో ఇదే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us